రిజర్వేషన్ల పరిమితిని తక్షణమే సవరించాలి.. మహాధర్నాకు డీఎంకే మద్దతు: కనిమొళి

రిజర్వేషన్ల పరిమితిని తక్షణమే సవరించాలి.. మహాధర్నాకు  డీఎంకే మద్దతు: కనిమొళి

బీసీ రిజర్వేషన్లు పెంపుకోసం  తెలంగాణ  ప్రభుత్వం చేస్తున్న పోరాటానికి డీఎంకే మద్దతు ఇస్తోందన్నారు ఆ పార్టీ ఎంపీ కనిమొళి. 42 శాతం బీసీ రిజర్వేషన్ కోటా కోసం ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర జరుగుతోన్న మహాధర్నాకు హాజరై మద్దతు తెలిపారు. ఈ సందర్బంగా మాట్లాడిన కనిమొళి.. రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రయత్నాలకు అన్ని  స్థాయిల్లో తమ మద్దతు ఉంటుందన్నారు. 

కాంగ్రెస్ చేస్తున్న ఈ  పోరాటంలో  తెలంగాణ ప్రభుత్వం, సీఎం రేవంత్ కు డీఎంకే మద్దతు ఉంటుందన్నారు.  కాంగ్రెస్ ఒక పెద్ద తప్ప్పును సరి చేస్తోందన్నారు.   బీజేపీ  పాలిత రాష్టాల్లో కేంద్రం అభివృద్ధిని అడ్డుకుంటోందని విమర్శించారు.  ప్రజల యోగక్షేమం కోసం తాము ఎల్లప్పుడూ మద్దత్తుగా ఉంటామన్నారు. రిజర్వేషన్ల పరిమితిని తక్షణమే సవరించాలని డిమాండ్ చేశారు కనిమొళి.. తరతరాలుగా వెనుకబడిన వర్గాలకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు.  తమిళినాడులో 69 శాతం రిజర్వేషన్లు అమలు అవుతున్నాయని చెప్పారు.  పెరియార్ కాలం నుంచి రిజర్వేషన్లు పెంచాలని డిమాండ్ ఉందన్నారు.  దేశంలో పోరాటం చేసి రిజర్వేషన్లు పెంచుకున్న ఏకైక రాష్ట్రం తమిళనాడు అని తెలిపారు. పార్లమెంటు లో కూడా ఈ అంశంపై తెలంగాణ ఎంపీలు చేసే పోరాటానికి డీఎంకే మద్దతు ఉంటుందన్నారు కనిమొళి.

విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించే​ బిల్లులను కేంద్రం ఆమోదించాలనే డిమాండ్​తో సీఎం రేవంత్​రెడ్డి నేతృత్వంలో ఆగస్టు 6న జంత‌ర్‌మంత‌ర్‌ దగ్గర మహా ధర్నా నిర్వహిస్తోంది. ఇప్పటికే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్​మహేశ్​కుమార్​ గౌడ్​తో పాటు మంత్రులు, కాంగ్రెస్​ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీలోని బీసీ నేతలు, బీసీ సంఘాల నాయకులంతా హాజరయ్యారు.