హైదరాబాద్లో ఏడబ్ల్యూఎస్ బిల్డర్ లాఫ్ట్స్

 హైదరాబాద్లో ఏడబ్ల్యూఎస్  బిల్డర్  లాఫ్ట్స్

హైదరాబాద్​, వెలుగు:  క్లౌడ్ కంపెనీ అమెజాన్​ వెబ్​సర్వీసెస్​(ఏడబ్ల్యూఎస్) హైదరాబాద్​లో బిల్డర్ లాఫ్ట్​ను ఏర్పాటు చేయనుంది. జెనరేటివ్ ఏఐ ప్రాముఖ్యత పెరుగుతున్న నేపథ్యంలో విద్యార్థులు, డెవలపర్లు కలిసి పనిచేసేందుకు, నేర్చుకునేందుకు దీనిని అందుబాటులోకి తెస్తున్నది.

శాన్ ఫ్రాన్సిస్కోలో ప్రారంభమైన ఒకటో బిల్డర్ లాఫ్ట్ ద్వారా వేలాది మంది డెవలపర్లకు మేలు జరిగింది. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ప్రధాన కేంద్రంగా ఎంచుకుని టెక్నాలజీ నిపుణులకు ఉచిత వర్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, నెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వర్కింగ్ ఈవెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను అందిస్తామని ప్రకటించింది. బిల్డర్ లాఫ్ట్​తో క్లౌడ్-నేటివ్ ఆర్కిటెక్చర్, ఏఐ రంగంలో నైపుణ్యాలను మెరుగుపరుచుకోవచ్చని ఏడబ్ల్యూఎస్ తెలిపింది.