బుమ్రా రికార్డు బద్దలు కొట్టిన అక్షర్ పటేల్

బుమ్రా రికార్డు బద్దలు కొట్టిన అక్షర్ పటేల్

బోర్డర్ గవాస్కర్ సిరీస్‌.. నాలుగో మ్యాచ్‌లో భారత ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ చరిత్ర సృష్టించాడు. పేస్ బౌలర్ జస్ప్రిత్ బుమ్రా రికార్డును బద్దలు కొట్టాడు. పూర్తిగా బ్యాటింగ్ కు అనుకూలించిన పిచ్ పై ఐదో రోజు ట్రావిస్ హెడ్ వికెట్ తీయడంతో టెస్టు్ల్లో భారత్ తరుపున అత్యంత వేగంగా 50 వికెట్లు తీసిన బౌలర్ గా రికార్డ్ నెలకొల్పాడు. బుమ్రా 2465 బంతుల్లో ఈ ఘనతను అందుకుంటే.. అక్షర్ 2205 బంతుల్లోనే ఈ ఫీట్ సాధించాడు. 

అత్యంత వేగంగా 50 టెస్ట్ వికెట్లు: 

1. అక్షర్ పటేల్- 2205 బంతులు
2. జస్ప్రీత్ బుమ్రా- 2465 బంతులు
3. కర్సన్ ఘావ్రీ- 2534 బంతులు
4. ఆర్ అశ్విన్- 2597 బంతులు