అయోధ్య భూమి పూజ ఆహ్వానపత్రిక..

అయోధ్య భూమి పూజ ఆహ్వానపత్రిక..

అయోధ్యలో నిర్మించే రాముడి గుడికి సంబంధించిన ఆహ్వాన పత్రిక విడుదలచేయబడింది. సరిగ్గా భూమి పూజకు రెండు రోజుల ముందు ఈ పత్రికను ఆవిష్కరించారు. ఆ పత్రికలో కేవలం అయిదుగురి పేర్లు మాత్రమే ముద్రించబడ్డాయి. వీరు మాత్రమే ఆరోజు జరిగే కార్యక్రమంలో స్టేజీ మీద ఉంటారు. ప్రధాని మోడీ, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) చీఫ్ మోహన్ భగవత్, ఉత్తర ప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, మరియు కార్యక్రమ నిర్వహణాధికారి మహంత్ నృత్య గోపాల్‌దాస్ మాత్రమే వేదికపై ఆశీనులవుతారు. వీరి పేర్లతో పాటు పత్రికపై రామ్ లల్లా మరియు శిశు లార్డ్ రామ్ విగ్రహాలు కూడా ఉన్నాయి.

కరోనా దృష్ట్యా.. భూమి పూజ కోసం కేవలం 150 మందికి మాత్రమే ఈ ఆహ్వాన పత్రికలు అందనున్నాయి. రామ్ మందిర్ నిర్మాణం బీజేపీ యొక్క ప్రధాన ఎజెండా. బీజేపీ ఎన్నికల వాగ్దానం మేరకు రామ్ మందిర్ నిర్మాణానికి మోడీ 40 కిలోల వెండి ఇటుకను అందజేయనున్నారు. అయోధ్యలో వివాదాస్పద రాముడి గుడి స్థలంపై సుప్రీంకోర్టులో కేసు వేసిన ఇక్బాల్ అన్సారీకి కూడా పత్రికను పంపినట్లు సమాచారం. ఆ రాముడి ఆశీస్సుల వల్లే తనకు ఈ ఆహ్వానం అందిందని అన్సారీ అన్నారు.

For More News..

ఎంపీ కార్తీ చిదంబరంకు కరోనా పాజిటివ్

చెల్లి కోరిక మేరకు రాఖీ రోజు పోలీసులకు లొంగిపోయిన నక్సల్ అన్న

వీడియో: కేటీఆర్ కు రాఖీ కట్టిన సోదరి కవిత