సుప్రీంకోర్టులోఇవాళ (బుధవారం) అయోధ్య వివాదంపై విచారణ జరుగనున్నది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసుపై విచారణ జరుపుతోంది. రామజన్మభూమి- బాబ్రీ మసీదు భూమి వివాదానికి సంబంధించి సుప్రీంకోర్టు పర్యవేక్షణలో మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించే విషయమై సుప్రీంకోర్టు ఇవాళ ఒక నిర్ణయం తీసుకోనున్నది.
