అయోధ్యలో మసీదు నిర్మాణానికి మక్కా నుంచి తొలి రాయి

అయోధ్యలో మసీదు నిర్మాణానికి మక్కా నుంచి తొలి రాయి

ఉత్తర ప్రదేశ్ లో  అయోధ్య మందిర ప్రారంభోత్సవంతో   హిందువుల 500 ఏళ్ల నాటి కల నెరవేరింది.   వివాదంగా ఉన్న 2.77 ఎకరాల భూమిని రాముడి జన్మస్థలంగా గుర్తిస్తూ సుప్రీం కోర్టు 2019లో  తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే.. అదే అయోధ్యలో ముస్లీంలకు మసీదును నిర్మించుకునేందుకు సుప్రీం తీర్పుతో ముస్లీం సంస్థలకు 5 ఎకరాల స్థలం ఉత్తర ప్రదేశం ప్రభుత్వం కేటాయించింది. అయితే అయోధ్యలో రామ మందిర నిర్మాణం, ప్రారంభోత్సవం జరగడం అయిపోయింది. .కానీ మసీదు నిర్మానానికి ఇంకా శంకుస్థాపన కూడా జరగలేదు. 

2024 మే లో అయోధ్యలో మసీదు నిర్మాణానికి శంకుస్థాపన చేస్తామని ఇటీవల ముస్లీం సంస్థ  ప్రకటన చేసింది. అయోధ్యలో మసీదు ప్రాజెక్టును ఇండో ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్ (ఐఐసీఎఫ్) డెవ్ లప్ మెంట్  కమిటీ పర్యవేక్షిస్తుదని వెల్లడించింది. మసీదు నిర్మాణానికి  దాదాపు నాలుగు సంవత్సరాలు పడుతుందని ఈ సంస్థ హెడ్ హజీ అరాఫత్ షేక్  వెల్లడించారు. మసీదుకు మహమ్మద్ ప్రవక్త పేరు మీద మసీదు ముహమ్మద్ బిన్ అబ్దుల్లా అని  పేరు పెట్టనున్నట్లు తెలిపారు.

మే లో శంకుస్థాపన చేయనున్న మసీదు నిర్మాణ పునాదికి  మొదటి ఇటుకను  మక్కాలోని ఝమ్ ఝమ్  బావి నుంచి తెచ్చిన పవిత్ర జలంతో తయారు చేశారు. నల్ల మట్టితో తయారు చేయబడిన ఈ ఇటుకపై  మసీదు పేరు , ఖురాన్ లోని భాగాలను చేర్చారు.  మార్చి 12 న రంజాన్ ఈద్ తర్వాత మసీదు ఉన్న  అయోధ్య సమీపంలోని ధన్నీపూర్ గ్రామానికి తీసుకెళ్తారు.  

ఇటుకను కర్నాటకలోని బీజాపూర్ (విజయపుర)లోని గోల్ గుంబాద్ సమీపంలో ఉన్న సూఫీ సన్యాసి సర్కార్ పీర్ ఆదిల్ వంశస్థుడు మొదటి ఇటుకను మోస్తారు .ఇటుకను  పీర్లు  కుర్లా నుంచి తూర్పు పార్శంలోని ముంబైలోని చివరి శివారు ప్రాంతమైన ములుండ్ కు కాలినడకన ఊరేగింపుగా తీసుకెళ్ళనున్నారు.  ఇటుక ఆరు రోజుల పాటు రోడ్డు మార్గంలో లక్నోకు వెళ్లి.. చివరకు ధన్నీపూర్ కు చేరుకుంటుంది. ప్రార్థనల కోసం ప్రతి 300 కి.మీ ఒకసారి బ్రేక్ తీసుకోనున్నారు అయితే ఇటుకను లక్నోకు  వరకు కాలి నడకన తీసుకెళ్లాలా వాహనంలో తీసుకెళ్లాల అనేది ఇంకా నిర్ణయించలేదని షేక్ చెప్పారు. 

మసీదు కోసం కొత్త వెబ్‌సైట్‌ను ఫిబ్రవరి 29న ప్రారంభించనున్నట్లు మసీదు కమిటీ తెలిపింది. పోర్టల్ నిర్మాణం కోసం విరాళాలు ఇవ్వడానికి ఉపయోగించే QR కోడ్‌ను కలిగి ఉంటుంది. మసీదు కాంప్లెక్స్‌లో భాగంగా క్యాన్సర్ ఆసుపత్రి, కళాశాల, వృద్ధాశ్రమం,  శాఖాహార వంటశాల వంటి అనేక ప్రాజెక్టులకు  ప్రణాళిక సిద్ధం చేసినట్లు వెల్లడించారు షేక్