బ్లాక్ ఫంగస్‌కు ఆయుర్వేద మందు

బ్లాక్ ఫంగస్‌కు ఆయుర్వేద మందు
  • రెండు ట్రీట్ మెంట్ పద్ధతులను ప్రకటించిన ఆయుష్ హాస్పిటల్స్ 
  • వివరాలు వెల్లడించిన ఆయుష్  డైరెక్టర్ అలగు వర్షిణి

హైదరాబాద్, వెలుగు: కరోనా బారిన పడి కోలుకున్న పేషెంట్లకు తీవ్ర ముప్పుగా మారిన బ్లాక్ ఫంగస్ (మ్యూకర్ మైకోసిస్)ను ఆయుర్వేద ట్రీట్ మెంట్ తో పూర్తిగా నివారించొచ్చని ఆయుష్ డైరెక్టర్ అలుగు వర్షిణి వెల్లడించారు. బుధవారం ఎర్రగడ్డలోని డా. బీఆర్ కేఆర్ గవర్నమెంట్ ఆయుర్వేద కాలేజీలో ఆమె మీడియాతో మాట్లాడారు. బ్లాక్ ఫంగస్ నివారణకు ఆయుర్వేదంలో రెండు ట్రీట్ మెంట్ పద్ధతులు ఉన్నాయని చెప్పారు. రెండు ట్రీట్ మెంట్ పద్ధతులు, మందులు, వాటిని వాడేందుకు గైడ్ లైన్స్ ను విడుదల చేశారు. ఈ మందులను ఆయుర్వేద డాక్టర్ల పర్యవేక్షణలో మాత్రమే వాడాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ వైస్ చాన్స్ లర్ డా. కరుణాకర్ రెడ్డి, ఆయుర్వేద అడిషనల్ డైరెక్టర్ డా. కే అనసూయ, డా. బూర్గుల రామక్రిష్ణారావు గవర్నమెంట్ ఆయుర్వేద మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ డా. పి శ్రీకాంత్ బాబు పాల్గొన్నారు.  

మొదటి విధానం 
1. గంధక రసాయనం- 500 మిల్లిగ్రాములు. రోజుకు మూడు సార్లు భోజనం తర్వాత
2. వ్యోషాది వటి- 250 మిల్లిగ్రాములు. రోజుకు రెండు సార్లు భోజనానికి ముందు
3. వసంత కుసుమాకర రస్ 125 మిల్లిగ్రాములు. రోజుకు రెండుసార్లు 
4. శుభ్ర భస్మ- 500 మిల్లిగ్రాముల చూర్ణం. 50 మి.గ్రా. నీళ్లలో కలుపుకుని పుక్కిలించాలి.  

రెండో విధానం
1. నారదీయ లక్ష్మీవిలాస రస్ -500 మిల్లిగ్రాములు. రోజుకు రెండుసార్లు భోజనం తర్వాత
2. కైషార గుగ్గులు- 500 మిల్లిగ్రాములు. రోజుకు మూడు సార్లు భోజనం తర్వాత
3. సుదర్శన ఘనవటి -500 మిల్లిగ్రాములు. రోజుకు రెండుసార్లు భోజనానికి ముందు
4. నిషా ఆమ్లకి -500 మిల్లిగ్రాములు. రోజుకు మూడు సార్లు భోజనానికి ముందు.