ఆయుష్మాన్​ భారత్​ క్లెయిమ్స్​ తగ్గినయ్

ఆయుష్మాన్​ భారత్​ క్లెయిమ్స్​ తగ్గినయ్

న్యూఢిల్లీ: లాక్​డౌన్​ టైంలో ఆయుష్మాన్​ భారత్​ క్లెయిమ్స్ తగ్గాయని లేటెస్ట్​ స్టడీలో తేలింది. ముందే నిర్ణయించిన ఆపరేషన్లు వాయిదా పడ్డాయి.. వారానికి సుమారు 51 శాతం క్లెయిమ్స్ తగ్గాయని సైంటిస్టుల టీమ్​ వెల్లడించింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో క్లెయిమ్స్ సంఖ్య బాగా పడిపోయిందని పేర్కొంది. ఈ ఏడాది మార్చి 25 నుంచి జూన్​ 2 దాకా దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన క్లెయిమ్స్ లను పరిశీలించాక ఈ విషయాన్ని గుర్తించినట్లు నేషనల్​ హెల్త్​ అథారిటీ(ఎన్​హెచ్​ఏ) తెలిపింది. ఆయుష్మాన్​ భారత్​ ప్రధాన మంత్రి జన్​ ఆరోగ్య యోజన(ఏబీ పీఎం‌‌‌‌‌‌‌‌-జేఏఏ) పథకం అమలు బాధ్యతను ఎన్​హెచ్​ఏ చూసుకుంటోంది.

ఈ క్రమంలో గడిచిన మూడు నెలల రిపోర్టులను పరిశీలించగా.. ఆస్పత్రుల్లో సర్జరీలు వాయిదా పడ్డట్టు తేలిందని వెల్లడించింది. కాటరాక్ట్, జాయింట్​ రీప్లేస్​ మెంట్, కార్డియోవాస్కులర్​ సర్జరీ.. తదితర ఆపరేషన్లు వాయిదా పడ్డాయని తెలిపింది. సగటున వారానికి 51 శాతం కేసులు తగ్గాయని వివరించింది. లాక్​ డౌన్​ కు ముందు వారానికి 62 వేల క్లెయిమ్స్ నమోదవుతుండగా.. ఈ నెల మాత్రం ఇది 57 శాతం తగ్గి కేవలం 27,167 క్లెయిమ్స్ మాత్రమే నమోదయ్యాయని ఎన్​హెచ్​ఏ అధికారులు చెప్పారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం