
జనగామ, వెలుగు: జనగామ జిల్లా గవర్నమెంట్ హాస్పిటల్లో ఆయుష్మాన్ భారత్ కింద తొలి సర్జరీ చేసినట్లు హాస్పిటల్ సూపరింటెండెంట్ సుగుణాకర్ రాజు తెలిపారు. గుండాల మండలం వెల్మజాలకు చెందిన కాచిగల్ల ఎల్లయ్యకు సోమవారం బైలాట్రల్హైడ్రోసీల్సర్జరీ చేసినట్లు వెల్లడించారు. ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న ప్రతిఒక్కరికి ఆయుష్మాన్భారత్ వర్తిస్తుందని చెప్పారు. ఈ స్కీమ్ కింద రూ.5లక్షల వరకు వైద్య ఖర్చును సర్కారే భరిస్తుందన్నారు. 642 రకాల జబ్బులకు ఈ స్కీమ్కింద ట్రీట్మెంట్ అందుతుందని చెప్పారు. హెవీ ఫీవర్, కొవిడ్ ట్రీట్మెంట్దీని పరిధిలోకి వస్తాయన్నారు.