
ఆస్థాన నర్తకిగా, వేశ్యగా చరిత్రలో పేర్కొన్న ఆమ్రపాలితో తనను పోల్చి సమాజ్ వాదీ పార్టీ ఎంపీ అభ్యర్థి మహిళలను కించపర్చారని ఇలా పోలిస్తే ఊరుకోబోనని బీజేపీ నాయకురాలు జయప్రద అన్నారు. ఉత్తరప్రదేశ్ లోని రాంపూర్ లోకసభసీటు నుంచి బీజేపీ తరపున జయప్రద, సమాజ్ వాదీ పార్టీతరపున ఆజాంఖాన్ పోటీ పడుతున్నారు. తొమ్మిది సార్లు రాంపూర్ నుంచి ఎమ్మెల్యేగా గెలవడమే కాకుండా క్యాబినెట్ మంత్రిగా పనిచేసిన ఆజాంఖాన్ మహిళలపై నోరుపారేసు కోవడాన్ని ప్రజలే అసహ్యించుకుంటున్నారని జయప్రద అన్నారు. ఓట్ల రూపంలో ప్రజలు ఆయనకు గట్టిగాసమాధానం చెప్తారని అన్నారు. మహిళలను ఉద్దేశిస్తూతప్పుడు మాటలు మాట్లాడడం ఆయనకి కొత్తేమీకాదన్నారు. ఎస్పీ టిక్కె ట్ పై మొదటిసారిగాపోటీ చేసినప్పుడు తన కోసం ప్రచారం చేసినఆయనకు తన గురించి తెలియదా? అనిజయప్రద ప్రశ్నిం చారు