నానో కారును హెలికాప్టర్‌గా మార్చేసిన కార్పెంటర్

నానో కారును హెలికాప్టర్‌గా మార్చేసిన కార్పెంటర్

ఆజంగఢ్ కు చెందిన ఓ కార్పెంటర్ నానో కారును హెలికాప్టర్ గా డిజైన్ చేశారు. ఇది రోడ్డుపై వెళ్లడమే కాకుండా.. కారులో ప్రయాణిస్తున్న వారికి కూడా విమాన ప్రయాణ అనుభూతిని కలిగిస్తుందని కార్పెంటర్ సల్మాన్ చెబుతున్నారు. తాను రోడ్డుపై నడిచే హెలికాప్టర్ ను తయారుచేశానని, దీని తయారీకి నాలుగు నెలల సమయం పట్టిందని చెప్పారు. దీని ధర రూ.3 లక్షలన్న సల్మాన్... ప్రస్తుతం దీనికి చాలా డిమాండ్ ఉందని ఆనందం వ్యక్తం చేశారు. తాను డిజైన్ చేసిన ఈ హెలికాప్టర్ ను చూడడానికి ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారని సల్మాన్​ అన్నారు. రోడ్డుపై వెళుతుంటే చాలా మంది గుమిగూడి దీన్ని వింతగా చూశారని హర్షం వ్యక్తం చేశారు.

హెలికాప్టర్లలో ప్రయాణించలేని వారికి ఇది ఆ స్థాయి అనుభూతిని కలిగిస్తుందని సల్మాన్ అభిప్రాయపడ్డారు. తన ఆలోచనలను ఇలాగే ముందుకు తీసుకెళ్తానని, భవిష్యత్తులో మరిన్ని ఆవిష్కరణలు చేస్తానని తెలిపారు. ప్రభుత్వం గానీ.. కంపెనీలు గానీ ముందుకొచ్చి తనకు సహాయం అందిస్తే నీరు, గాలితో నడిచే హెలికాప్టర్లను కూడా తయారుచేయగలనని ధీమా వ్యక్తం చేశారు.