వచ్చే నెల 1 నుంచి బీఫార్మసీ కౌన్సెలింగ్

వచ్చే నెల 1 నుంచి  బీఫార్మసీ కౌన్సెలింగ్

హైదరాబాద్, వెలుగు: ‘బీఫార్మసీ అడ్మిషన్లు ఇంకెప్పుడు?’ అనే శీర్షికతో బుధవారం వెలుగులో ప్రచురితమైన కథనంపై విద్యాశాఖ అధికారులు స్పందించారు. వచ్చే నెల 1 నుంచి బీఫార్మసీ, ఫార్మా-డీ, బయో టెక్నాలజీ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం కౌన్సెలింగ్ ప్రారంభమవుతుందని ప్రకటించారు. ఈ మేరకు ఎంసెట్ బైపీసీ అడ్మిషన్ షెడ్యూల్​ను టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ నవీన్ మిట్టల్ రిలీజ్ చేశారు.

ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్​ నవంబర్ 1 నుంచి 6 దాకా, సీట్ల కేటాయింపు నవంబర్ 9న ఉంటుంది. సీట్లు పొందిన అభ్యర్థులు 13లోగా ఆన్​లైన్ లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్ 17న ప్రారంభం అవుతుంది. 22న సీట్ల అలాట్మెంట్ ఉంటుంది. సీట్లు పొందిన అభ్యర్థులు 25లోపు కాలేజీల్లో రిపోర్టు చేయాలి. కాగా, 23న స్పాట్ అడ్మిషన్ల షెడ్యూల్ రిలీజ్ చేయనున్నారు.