
హైదరాబాద్, వెలుగు: కోల్ ఇండియా లిమిటెడ్ (సీఐఎల్) బాధ్యతలు మరోసారి తెలుగు వ్యక్తికి దక్కాయి. సంస్థ సీఎండీగా ఏపీలోని వైజాగ్‌కు చెందిన సాయిరామ్ నియమితులయ్యారు. పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ సెలక్షన్ బోర్డ్ (పీఈఎస్బీ) శనివారం 11 మంది అభ్యర్థుల నుంచి సాయిరామ్‌ను ఎంపిక చేసింది. ప్రస్తుతం ఆయన నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్‌లో సీఎండీగా ఉన్నారు. గతంలో కోల్ ఇండియా సీఎండీగా తెలుగు వ్యక్తి నర్సింగరావు బాధ్యతలు నిర్వహించారు.
తాజాగా సాయిరామ్ నియామకంతో మరోసారి తెలుగు వ్యక్తికి కోల్ ఇండియా సీఎండీ బాధ్యతలు దక్కినట్లయింది. సాయిరామ్..రాయపుర ఎన్‌ఐటీ నుంచి మైనింగ్ ఇంజినీరింగ్ డిగ్రీ పూర్తి చేశారు. వివిధ హోదాల్లో సమర్థవంతంగా పనిచేశారు. ముఖ్యంగా, సెంట్రల్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (సీసీఎల్)లో డైరెక్టర్ (టెక్నికల్) గా పని చేశారు.