హైదరాబాద్, వెలుగు: స్కూల్ ఎడ్యుకేషన్ వరంగల్ ఆర్జేడీగా పూర్తి అదనపు బాధ్యతలను (ఎఫ్ఏసీ) జాయింట్ డైరెక్టర్ బి.వెంకటనర్సమ్మకు రాష్ట్ర సర్కార్ అప్పగించింది. ఈ మేరకు విద్యాశాఖ యోగితా రాణా ఉత్తర్వులు జారీ చేశారు. తక్షణమే బాధ్యతలు స్వీకరించాలని ఆమె ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం ఆమె స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్లో జేడీ (సర్వీసెస్)గా కొనసాగుతున్నారు.
0అయితే, మే 30న జేడీ ఈ.విజయలక్ష్మిని వరంగల్ ఆర్జేడీగా బదిలీ చేశారు. ఆమె ఆ స్థానంలో బాధ్యతలు చేపట్టకుండా సెలవుల్లోకి వెళ్లిపోయారు. దీంతో ఆ బాధ్యతలను సమగ్ర శిక్ష జేడీ మదన్మోహన్కు ఇన్చార్జిగా ఇచ్చారు. ప్రస్తుతం ఆయనను తప్పించి, మళ్లీ వెంకటనర్సమ్మకు ఆర్జేడీగా ఎఫ్ఏసీ బాధ్యతలు అప్పగించారు.
