
గోల్డ్, గన్స్ నేపథ్యంలో న్యూ ఏజ్ క్రైమ్ కామెడీ డ్రామాగా రూపొందుతున్న చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’. గుణి మంచికంటి దర్శకుడు. చిత్రాలయం స్టూడియోపై వేణు దోణెపూడి నిర్మిస్తున్నారు. టిను ఆనంద్, ఉపేంద్ర, జార్జ్ మరియన్, అక్షయ్ లగుసాని , విష్ణు, కార్తికేయ, విస్మయశ్రీ, మాళవి ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. దసరా సందర్భంగా ఈ మూవీ కాన్సెప్ట్ పోస్టర్‌ను దర్శకుడు తరుణ్ భాస్కర్ లాంచ్ చేసి బెస్ట్ విషెస్ చెప్పాడు.
‘గన్స్, గోల్డ్ చుట్టూ జరిగే వేట.. ముగ్గురి తెలివి తేటలు.. ఒక రోజులో జరిగే ఘటనలు.. ఓ ఆరుగురి ప్రయాణమే ఈ సినిమా కాన్సెప్ట్ అని, ఈ జర్నీ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచుతుందని మేకర్స్ ఈ సందర్భంగా తెలియజేశారు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఇతర వివరాలను త్వరలో వెల్లడించనున్నారు.