
బాబా రాందేవ్ కంపెనీ పతంజలీ ఒక్కో రంగంలోకి విస్తరిస్తోంది. మొదట్లో ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ తో ప్రారంభమైన కంపెనీ తర్వాత రిటైల్ రంగంలోకి ఎంటరైంది. తాజాగా బీమా రంగంలోకి ప్రవేశించింది. ఇండియాలో ఇన్సురెన్స్ పై అవగాహన పెరుగుతుండటంతో ఈ సెక్టార్ భవిష్యత్తులో చాలా పెద్ద ఎత్తున విస్తరించే అవకాశం ఉంది. అందుకే ఈ రంగంపై కన్నేసిన బాబా రాందేవ్ కంపెనీ తాజాగా ఎంటరైనట్లు ప్రకటించింది.
మాగ్మా జనరల్ ఇన్సురెన్స్ (Magma General Insurance) అనే కంపెనీలో మెజారిటీ వాటాను కొనుగోలు చేసి ఇన్సురెన్స్ సెక్టార్ లోకి పతంజలి ప్రవేశించింది. ఇప్పటికే ఆయుర్వేదిక్, ఆరోగ్యం, నిత్యావసర వస్తు సేవలలో ఉన్న ఈ కంపెనీ పోర్ట్ ఫోలియోలోకి ఇన్సురెన్స్ యాడ్ కావడం విశేషం.
Also Read : ఇన్సురెన్స్ రంగంలోకి రాందేవ్ బాబా ‘పతంజలి’
ఈ ఎంట్రీతో మాగ్మా జనరల్ ఇన్సురెన్స్ కు పతంజలి కంపెనీ ప్రమోటర్ గా ఉండనుంది. ఇండియాలో ఇన్సెరెన్స్ రంగంలో పెద్ద ఎత్తున విస్తరించేందుకు మరిన్ని వ్యూహాలతో ముందుకెళ్తామని బాబా రాందేవ్ తో పాటు ఇతర ప్రమోటర్లు ప్రకటించారు.