2026 సంవత్సరం వచ్చి రెండు వారాలు అయిపోయింది.. కాలం ముందుకెళుతూనే ఉంది.. కొత్త ఏడాది వచ్చినప్పుడల్లా.. ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది జ్యోతిష్య నిపుణుల అంచనాలు హైలెట్ కావటం కామన్. ఇందులో ప్రముఖంగా వినిపించేంది బాబా వంగా జ్యోతిష్యం. బల్గేరియా దేశానికి చెందిన అంధ ఆధ్యాత్మిక వేత్త బాబా వంగా. ఈమె అప్పట్లో ప్రపంచం గురించి చెప్పిన జ్యోతిష్యం చాలా మంది నిజం అయ్యిందని బలంగా నమ్ముతాయి చాలా చాలా దేశాలు. 2026లో బాబా వంగా జ్యోతిష్యం అంటూ చాలా వార్తలు వచ్చాయి. 10 రోజుల తర్వాత మళ్లీ ఆమె జ్యోతిష్యంపై ప్రపంచ వ్యాప్తంగా.. అన్ని దేశాల్లో తీవ్ర చర్చ నడుస్తుంది. నిరంతరం వైరల్ అవుతుంది.. కారణం ఏంటీ.. ఎందుకు ఇలా.. ఆమె ఏం చెప్పింది.. ఏం జరుగుతుంది.. వైరల్ ఎందుకు అయ్యిందో ఓసారి వివరంగా తెలుసుకుందాం...
బాబా వంగా జ్యోతిష్యం ప్రకారం.. 2026లో భూమిపై 7 నుంచి 8 శాతం తీవ్ర భూకంపాలు, అగ్నిపర్వతాలు బద్దలు అవ్వటం.. వరదలు, తుఫానులతో విధ్వంసం జరుగుతుందని ఆమె జ్యోతిష్యం చెప్పినట్లు చెబుతున్నారు. 2026 ఏడాది వచ్చి రెండు వారాల్లోనే ఆ సంకేతాలు స్పష్టంగా కనిపించాయి. హవాయి దీవుల్లో అగ్నిపర్వాతాలు బద్దలయ్యాయి. అమెరికా, శ్రీలంక దేశాల్లో తుఫానులు విధ్వంసం చేస్తున్నాయి. ఢిల్లీలో స్వచ్ఛమైన గాలి లేదు. చలి తీవ్రత బాగా పెరిగింది. ఈ సంకేతాలు ప్రకృతి విపత్తుకు సంకేతం కదా.. బాబా వంగా ఇదే కదా చెప్పింది అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
Also Read : నేను ఫైటర్‌ను.. ధైర్యంగా ఉన్నా..యూఎస్ జైల్లోంచి వెనెజువెలా ప్రెసిడెంట్ మెసేజ్
దేశాల మధ్య యుద్ధ వాతావరణం తీవ్రం అవుతుందని.. ఆమె చెప్పినట్లే జరుగుతుంది అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు. న్యూ ఇయర్ వచ్చిన వెంటనే వెనిజువెలాపై అమెరికా దాడి. ఆ తర్వాత ఇరాన్ దేశంలో అల్లర్లు. గాజాపై ఆగని ఇజ్రాయేల్ దాడులు.. బంగ్లాదేశ్ లో కొనసాగుతున్న అల్లర్లు. క్యూబా, కొలంబియా, గ్రీన్ లాండ్ పై అమెరికా వైఖరితో ఆయా దేశాల్లో హై టెన్షన్స్. రష్యా, ఉక్రెయిన్ మధ్య తీవ్రం అవుతున్న దాడులు.. ఇవన్నీ దేనికి సంకేతం.. 2026 వినాశనమే కదా అంటున్నారు చాలా మంది నిపుణులు.. ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ ప్రపంచంలోని చాలా దేశాల్లో ఇప్పుడు బాబా వంగా జ్యోతిష్యం నిజం అంటూ చర్చ విపరీతంగా సాగుతుంది.
ఇక 2026లో ఆర్థిక వ్యవస్థ అల్లకల్లోలం అంటూ ఆమె చెప్పినట్లు వస్తున్న వార్తలను.. కళ్ల ముందు నిదర్శనం కనిపిస్తుంది. వెలిజువెలాపై అమెరికా దాడి తర్వాత.. మిగతా దేశాలపై అమెరికా వైఖరితో స్టాక్ మార్కెట్లు రోజురోజుకు కుప్పకూలుతున్నాయి. 2026 ఏ ముహూర్తాన వచ్చిందో.. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు ఇండియన్ స్టాక్ మార్కెట్ లాభాలను చూడలేదు. అంతర్జాతీయంగానూ ఇదే పరిస్థితి నెలకొంది.
అందుకే అందరూ అనుకుంటున్నారా.. అంచనా వేస్తున్నారు.. భావిస్తున్నారు.. ఏంటంటే.. 2026లో ప్రపంచం అంతం అవుతుందా అని.. ఇందులో ఎలాంటి వాస్తవం లేదు. బాబా వంగా జ్యోతిష్యం ప్రకారం.. 5079లో ప్రపంచం అంతం అవుతుంది. ఒకే రోజు అంతం అనేది ఉండదు కదా.. అందుకే 2 వేల సంవత్సరం నుంచి జనాభా తగ్గుదల కనిపిస్తుంది అని.. 2026లో దాని విధ్వంసం.. నష్టం.. వినాశనం ఎక్కువగా ఉంటుందని.. ఆర్థికంగానే కాకుండా రాజకీయంగా.. యుద్ధాల వల్ల నష్టం చాలా ఎక్కువగా ఉంటుందనేది ఇప్పుడు బాబా వంగాను విశ్వసించే వాళ్లు చెబుతున్న మాట..
ఏదిఏమైనా ప్రపంచ దేశాలు అన్నీ ఇప్పుడు దీనిపై ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. కారణం.. జరుగుతున్న పరిణామాలు కళ్లకు కనిపిస్తున్నాయి కదా.. సో.. 2026లో ప్రపంచం అంత కాదు.. అంతానికి ఆరంభం అనేది ఇప్పుడు మాట్లాడుకుంటున్న మాటలు.. చర్చిస్తున్న అంశం ఇదే..
