
ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది (2025) విపత్కర పరిస్థితి.. ఉద్రిక్తత.. తీవ్రంగా నష్టం జరుగుతుందని బాబా వంగా ముందే హెచ్చరించారు. పలు దేశాల మధ్య అభిప్రాయ బేధాలు.. నీటి యుద్దాలు జరుతాయని బాబా వంగా అంచనా వేశారు.
బల్గేరియాకు చెందిన ఆధ్యాత్మిక వేత్త బాబా వంగా 2025 ప్రపంచంలో భయంకరమైన పరిస్థితులు ఉంటాయని భవిష్యత్తు ముందే చెప్పారు. ఈ ఏడాది ఆందోళనకర పరిస్థితులు ఉంటాయని.. తరచుగా భూకంపాలు... రాజకీయ నాయకుల మధ్య.. విద్వేష పూరిత వాతావరణం.. కమ్యూనిటి గొడవలు పెచ్చు మీరుతాయి. ఇక దేశాల మధ్య యుద్ద వాతావరణం ఉంటుందని తెలిపారు. ఇప్పటికే భారత .. పాకిస్తాన్ సరిహద్దుల్లో సైన్యం మోహరించింది. తరచుగా ప్రపంచవ్యాప్తంగా భూకంపాలు వస్తున్నాయి.
యూరప్ దేశాల్లో ఈ ఏడాది ( 2025) యుద్దమేఘాలు కమ్ముకుంటాయని బాబా వంగా చెప్పారు. స్పష్టంగా దేశాల పేర్లు చెప్పనప్పటకీ.. విధ్వంసం.. నాశనం ఎక్కువుగా ఉంటుందని హెచ్చరించారు. దీనివలన ఆర్దిక ఇబ్బందులు వస్తాయని.. ప్రపంచ ద్రవ్య వ్యవస్థలు విచ్ఛిన్నమవుతాయన్నారు. వాణిజ్య సమస్యలు .. మార్కెట్ అస్థిరత పెరుగుతాయి.
2025 లో ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితుల ఆధారంగా బాబా వంగా అంచనాల గురించి చర్చించుకుంటున్నారు. యుద్ధం ... ఆర్థిక ఇబ్బందులతో పాటు, బాబా వంగా 2025 లో శక్తివంతమైన భూకంపాల గురించి హెచ్చరించారు. ఈ సంవత్సరం ప్రారంభంలో మయన్మార్‌ను 7.7 తీవ్రతతో భూకంపం వచ్చింది. అప్పుడు భారీగా ఆస్తి నష్టంతో పాటు ప్రాణనష్టం కూడా సంభవించింది. థాయిలాండ్ కూడా తీవ్రంగా ప్రభావితమైంది. ఈ విపత్తులు ఆమె సంవత్సరాల క్రితం చెప్పిన దానితో సరిపోలుతున్నాయి.