
తుర్కపల్లి, వెలుగు: యాదాద్రి భువనగిరి జిల్లాలో మూడేళ్ల చిన్నారిపై వరుసకు బాబాయ్అయ్యే వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తుర్కపల్లి మండలం పెద్దతండాకు చెందిన మూడేళ్ల చిన్నారి ఆదివారం ఇంటి వద్ద ఆడుకుంటోంది. వరుసకు బాబాయ్అయ్యే నవీన్(18) పాపకు మాయమాటలు చెప్పి ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు. చిన్నారి తీవ్ర కడుపు నొప్పితో ఇంట్లో ఏడుస్తూ ఉండడం గమనించిన తల్లిదండ్రులు వెంటనే స్థానిక హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. పరీక్షించిన డాక్టర్లు చిన్నారిపై అత్యాచారం జరిగినట్లు కన్ఫార్మ్చేశారు. పాప ద్వారా జరిగిన విషయాన్ని తెలుసుకున్న తల్లిదండ్రులు సోమవారం పోలీసులకు కంప్లైంట్ చేశారు.నిందితుడిపై పోక్సో యాక్ట్ కింద కేసు ఫైల్ చేసినట్లు యాదగిరిగుట్ట సీఐ నవీన్‌రెడ్డి, ఎస్సై మధుబాబు తెలిపారు. నవీన్మద్యం తాగుతూ ఉంటాడని, గంజాయి తీసుకుంటాడని గ్రామస్తులు చెబుతున్నారు.