రికార్డు సృష్టించిన పాక్ క్రికెటర్లు

రికార్డు సృష్టించిన పాక్ క్రికెటర్లు

పాకిస్తాన్ ఓపెనర్లు బాబర్ అజామ్, మహమ్మద్ రిజ్వాన్ టీ 20 క్రికెట్ లో  సరికొత్త  రికార్డు సృష్టించారు. కరాచీ వేదికగా  ఇంగ్లండ్  తో జరిగిన రెండో టీ20 మ్యాచ్ లో ఏకంగా 203 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇప్పటివరకు టీ 20లో ఇదే అత్యధిక భాగస్వామ్యం కావడం విశేషం. బాబర్ 66 బంతుల్లో 110 పరుగులు చేసి  నాటౌట్‌గా నిలవగా, రిజ్వాన్ 51 బంతుల్లో 88 పరుగులతో అజేయంగా నిలిచాడు.

ఈ మ్యాచ్ లో పాక్  10 వికెట్ల తేడాతో విజయం సాధించడంతో ఇప్పుడు  ఏడు మ్యాచ్‌ల సిరీస్‌ 1-1తో సమంగా ఉంది. ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్  చేసిన ఇంగ్లండ్‌ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 199 రన్స్‌ చేసింది. ఆ తరువాత బరిలోకి దిగిన పాక్ జట్టు... వికెట్ పడకుండా మ్యాచ్ ను ఫినిష్ చేసింది. కాగా ఇవాళ రెండు జట్ల మధ్య మూడో టీ20 మ్యాచ్‌ జరగనుంది.