రోహిత్ శర్మ ప్రపంచ రికార్డు బద్దలు: టీ20ల్లో వరల్డ్ రికార్డ్ సృష్టించిన బాబర్

రోహిత్ శర్మ ప్రపంచ రికార్డు బద్దలు: టీ20ల్లో వరల్డ్ రికార్డ్ సృష్టించిన బాబర్

పాకిస్తాన్ స్టార్ బ్యాటర్ బాబర్ అజామ్ అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన తొలి బ్యాటర్‎గా రికార్డ్ సృష్టించాడు. దక్షిణాఫ్రికాతో గడాఫీ స్టేడియంలో జరిగిన రెండో టీ20లో ఈ ఫీట్ నెలకొల్పాడు. తద్వారా టీమిండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మను రికార్డును బాబర్ అజామ్ బద్దలు కొట్టాడు. ఇప్పటి వరకు టీ20ల్లో అత్యధిక పరులుగురు చేసిన రికార్డు రోహిత్ శర్మ పేరిట ఉండేది.

రోహిత్ శర్మ 151 ఇన్నింగ్స్‌లలో 32.05 సగటు, 140.89 స్ట్రైక్ రేట్‌తో 4231 పరుగులు చేయగా.. బాబర్ 122 ఇన్నింగ్స్‌లలో40 సగటు, 129.14 స్ట్రైక్ రేట్‌తో 4232 పరుగులు చేసి హిట్ మ్యాన్‎ను అధిగమించాడు. టీ20ల్లో హిట్ మ్యాన్ ఐదు సెంచరీలు, 32 అర్ధ శతకాలు చేయగా.. బాబర్  మూడు సెంచరీలు, 36 అర్ధ సెంచరీలు బాదాడు. టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మూడో స్థానంలో ఉన్నాడు. టీ20ల్లో కోహ్లీ 4188  రన్స్ చేశాడు. 

టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన టాప్ 5 ఆటగాళ్లు:

  • ఆటగాళ్ళు    పరుగులు
  • బాబర్ ఆజం    4234 
  • రోహిత్ శర్మ    4231
  • విరాట్ కోహ్లీ    4188 
  • జోస్ బట్లర్    3869

ఇక మ్యాచ్ విషయానికొస్తే.. దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో పాకిస్తాన్ తొమ్మిది వికెట్ల తేడాతో అలవోక విజయం సాధించింది. 111 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని మరో 41 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. యంగ్ బ్యాటర్ సైమ్ అయూబ్ 38 బంతుల్లో 71 పరుగులతో అజేయంగా నిలిచి పాక్ కు ఘన విజయాన్ని అందించాడు. బాబర్ 18 బంతుల్లో 11 పరుగులు చేసి అయూబ్ అండగా నిలిచాడు. ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన సఫారీలు సల్మాన్ మీర్జా, ఫహీమ్ అష్రఫ్ దెబ్బకు19.2 ఓవర్లలో కేవలం 110 పరుగులకే ఆలౌట్ అయ్యారు.