
ముందు నమ్మించి.. తర్వాత నవ్వించి.. చివరకు గొంతు కొరికింది ఓ కొండముచ్చు. సూర్యాపేటలో ఈ సంఘటన జరిగింది. ఓ వ్యక్తి బైక్ పై కూర్చొని సరదాగా ఆటలాడిన ఆ వానరం తర్వాత అతడిపై దాడి చేసింది. యువకుడు కొండముచ్చును వదిలించుకోవాలని చూసేలోపే అతని గొంతు కొరికి పరారైంది. దాడిలో రాయపర్తి గ్రామానికి చెందిన యువకుడికి గాయాలయ్యాయి. గత 20 రోజులుగా కొండముచ్చు వరుస దాడులకు పాల్పడుతోందని స్థానికులు తెలిపారు.