
బరేలీ: సాయంత్రంపూట టెర్రస్‌పైన వాకింగ్ చేస్తున్న ఓ జంటపై కోతుల దండు దాడిచేసింది.. తండ్రి చేతుల్లోని పసికందును లాగి కిందపడేసింది. దీంతో ఆ పసికందు చనిపోయిండు. ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ జిల్లాలో ఆదివారం జరిగిందీ విషాదం. స్థానిక అటవీ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. జిల్లాలోని డుంకాలో నిర్దోష్ ఉపాధ్యాయ్ తన భార్యతో కలిసి ఉంటున్నాడు. ఈ దంపతులకు నాలుగు నెలల క్రితమే కొడుకు పుట్టిండు. ఆదివారం సాయంత్రం దంపతులిద్దరూ తాము ఉంటున్న బిల్డింగ్ పైకి వెళ్లారు. ఇద్దరూ వాకింగ్ చేస్తుండగా కోతుల గుంపు ఒకటి వాళ్లను చుట్టుముట్టింది. భయంతో మెట్లవైపు పరిగెత్తే క్రమంలో నిర్దోష్ చేతుల్లో ఉన్న పసికందు కిందపడ్డడు. వెంటనే బాబును ఎత్తుకునేందుకు ప్రయత్నించగా.. ఓ కోతి బాబును లాగేసింది. ఆపై బిల్డింగ్ పై నుంచి విసిరేసింది. మూడు అంతస్థుల నుంచి కిందపడ్డ ఆ పసికందు అక్కడికక్కడే చనిపోయాడు.