బాస్కు ఫ్యాన్స్ మనసు తెలియదా.. బేబీ నిర్మాత ఎమోషనల్ పోస్ట్

బాస్కు ఫ్యాన్స్ మనసు తెలియదా.. బేబీ నిర్మాత ఎమోషనల్ పోస్ట్

విడుదలై రెండు వారాలు గడుస్తున్నా బాక్సాఫీస్ దగ్గర బేబీ(Baby) సినిమా కలెక్షన్స్ జోరు మాత్రం తగ్గడంలేదు. ఈ సినిమాను చూసేందుకు ఆడియన్స్ ఇంకా ఎగబడుతూనే ఉన్నారు. దీంతో రికార్డ్ లెవల్లో వసూళ్లు రాబడుతోంది ఈ సినిమా. కేవలం రూ.7 కోట్లతో తెరకెక్కిన బేబీ సినిమా కేవలం 12 రోజుల్లోనే రూ.71 కోట్లు రాబట్టి చిన్న సినిమాల్లో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. దీంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. 

ఇక తాజాగా మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) కూడా తన స్పందనను తెలియజేశారు. ఇందులో భాగంగానే బేబీ చిత్ర నిర్మాత ఎస్కేఎన్(SKN), దర్శకుడు సాయి రాజేష్(Sai Rajesh) ను తన ఇంటికి పిలిపించుకొని మరీ వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఇక చిరంజీవిని కలిసి ఆ మధుర క్షణాలను ప్రేక్షకులతో పంచుకున్నారు నిర్మాత ఎస్కేఎన్. ఈ సందర్బంగా చిరుతో దిగిన ఫొటోస్ ను షేర్ చేస్తూ.. అమ్మకు బిడ్డ ఆకలి తెలియదా.. బాస్ కు ఫ్యాన్స్ మనసు తెలియదా అనే ఎమోషనల్ కాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

ఇక బేబీ సినిమా విషయానికి వస్తే.. ఆనంద్ దేవరకొండ(Anand Devarakonda), వైష్ణవి చైతన్య(Vaishnavi Chaitanya), విరాజ్ అశ్విన్(Viraj Ashwin) ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో కనిపించారు. ఎస్కేఎన్ నిర్మించిన ఈ సినిమాను దర్శకుడు సాయి రాజేష్ తెరకెక్కించారు. ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని అందుకుంది. అంతేకాదు.. చిన్న సినిమాల్లో అత్యంత తొందరగా రూ.50 కోట్లు కలెక్ట్ చేసిన సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది బేబీ మూవీ.