హానెస్ట్‌‌ అటెంప్ట్.. బేబీ : విజయ్ దేవరకొండ

హానెస్ట్‌‌ అటెంప్ట్.. బేబీ : విజయ్ దేవరకొండ

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ లీడ్ రోల్స్‌‌లో సాయి రాజేష్‌‌ తెరకెక్కించిన చిత్రం ‘బేబీ’. ఎస్‌‌కేఎన్ నిర్మించారు. గత శుక్రవారం విడుదలైన సినిమాకు లభిస్తున్న రెస్పాన్స్ గురించి తెలియజేసేందుకు టీమ్ సక్సెస్‌‌ మీట్ నిర్వహించింది. అతిథిగా హాజరైన విజయ్ దేవరకొండ మాట్లాడుతూ ‘ఓ రెండు ప్రేమ మేఘాలిలా పాట వచ్చినప్పుడే  మంచి లవ్ స్టోరీ చూస్తున్నామనే ఫీల్‌‌లోకి వెళ్లిపోయాను.  ఇవాళ ఈ సినిమా గురించి, క్యారెక్టర్స్ గురించి  మాట్లాడుకుంటున్నారు. ఇందులో ఒకరు చెడ్డ, మరొకరు మంచి అని చెప్పడం ఉద్దేశం కాదు. సొసైటీలో అన్ని రకాల వ్యక్తిత్వాలు ఉన్న వాళ్లు ఉంటారు. వైష్ణవి క్యారెక్టర్ ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. అబ్బాయిలు కూడా లవ్ బ్రేక్ చేసేవాళ్లు ఉంటారు. 

దర్శకుడు సాయి రాజేష్ హానెస్ట్‌‌గా అటెంప్ట్ చేశాడు. ఆనంద్ తనకు తానుగా ప్రాజెక్ట్స్ చేసుకుంటున్నాడు. తన సక్సెస్ గర్వంగా ఉంది. అలాగే విరాజ్, వైష్ణవికి  మంచి పేరొచ్చింది. ‘బేబీ’ మీద మీ లవ్ ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నా’ అన్నాడు. కార్యక్రమానికి హాజరైన నిర్మాతలు అల్లు అరవింద్, వై రవి శంకర్, నాగబాబు మూవీ టీమ్‌‌పై ప్రశంసలు కురిపించారు. ఈ సినిమా తమకు లైఫ్ ఇచ్చిందన్నారు ఆనంద్, విరాజ్, వైష్ణవి. ఇలాంటి మంచి సినిమాలే ఫ్యూచర్‌‌‌‌లోనూ చేస్తానని చెప్పాడు సాయి రాజేష్​.  ‘హౌస్‌‌ఫుల్స్‌‌తో నడుస్తోంది. ఇంత పెద్ద సక్సెస్‌‌కు కారణమైన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్’ అని చెప్పాడు ఎస్‌‌కేఎన్. నిర్మాత బన్నీ వాస్, దర్శకుడు మారుతి తదితరులు పాల్గొన్నారు.