కరోనా ట్రీట్ మెంట్ తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా?..!

 కరోనా ట్రీట్ మెంట్ తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా?..!

 కరోనా వైరస్‌కు చికిత్స (Covid 19 Treatment) తీసుకున్న ఓ పసికందు కళ్లు (Eyes) అసాధారణ రీతిలో ముదురు నీలి రంగులోకి మారాయి. ఈ ఘటన థాయ్‌లాండ్‌ (Thailand)లో వెలుగులోకి వచ్చింది.

 COVID-19 చికిత్స పొందిన 6 నెలల బాలుడి కళ్లు ముదురు గోధుమ రంగు నుంచి ముదురు నీలం రంగులోకి మారాయి. మెడికల్ జర్నల్ ఫ్రాంటియర్స్ ఇన్ పీడియాట్రిక్స్ ప్రకారం.. థాయిలాండ్‌‌కు చెందిన ఓ శిశువుకు జ్వరం, దగ్గు వచ్చాయి. పరీక్షలు నిర్వహించగా COVID-19 ఉన్నట్లు నిర్ధారణ అయింది. దీంతో తల్లిదండ్రులు 3 రోజుల పాటు ఫెవిపిరావిర్ ఔషధంతో చికిత్స అందించారు. అయితే మందులను ఉపయోగించిన 18 గంటల తర్వాత బాలుడి కళ్లు ముదురు గోధుమ రంగు నుంచి నీలం రంగులోకి మారిపోయాయి.

చిన్నారి తల్లి తన బిడ్డ కంటి రంగులో మార్పును గమనించి డాక్టర్‌కు చెప్పింది. దీంతో డాక్టర్ ఫేవిపిరావిర్ వాడడం ఆపేశారు. ఐదు రోజుల తర్వాత దాని బాలుడు కళ్లు నీలం రంగు నుంచి గోధుమ రంగుకు తిరిగి వచ్చాయి. దీంతో ఫెవిపిరావిర్ వాడకాన్ని ఆవేయాలని డాక్టర్ సూచించారు. చర్మం, గోర్లు, నోరు ఇతర శరీర భాగాలు నీలిరంగు రంగులోకి మారలేదు. 3 రోజుల ఫెవిపిరావిర్ థెరపీ తర్వాత కోవిడ్ లక్షణాలు తగ్గినా కళ్లలో కార్నియా రంగు మారడంతో చికిత్సను నిలిపివేయాలని సూచించాడు. ట్రీట్మెంట్ ఆపేసిన తర్వాత 5వ రోజు కళ్లు సాధారణ రంగుకు వచ్చినట్లు వైద్య నిపుణులు నివేదిక ఇచ్చారు.

ALSO READ : ఎగ్జామ్ లో చూపెట్టలేదని స్నేహితుడిని చితకబాదిండు

2021లో సైతం ఇలాంటి ఘటనే జరిగింది. భారతదేశంలోని 20 ఏళ్ల వ్యక్తి చికిత్సకి ఫెవిపిరావిర్ వినియోగించగా రోగి కళ్లపై సైడ్ ఎఫెక్ట్ చూపించాయి. ఫెవిపిరావిర్ వినియోగించిన రెండో రోజున, అతని అసలు ముదురు గోధుమ కళ్లు ప్రకాశవంతమైన నీలం రంగులోకి మారాయి. 2022లో థాయ్ ప్రజారోగ్య మంత్రిత్వ శాఖ ఫెవిపిరావిర్ అనే యాంటీవైరల్‌ను కోవిడ్ చికిత్సకు ఆమోదించింది. కోవిడ్-19 బారిన పడిన పిల్లలకు చికిత్స అందిచడానికి దీనిని ఉపయోగిస్తున్నారు.

మూడేళ్లుగా కోవిడ్-19 ప్రపంచాన్ని పట్టిపీడిస్తోంది. తన రూపాన్ని మార్చుకుంటూ ప్రజలపై దాడి చేస్తోంది. వ్యాక్సినేషన్ కార్యక్రమాలు జరుగుతున్నా కూడా పూర్తిస్థాయిలో కంట్రోల్ కావడం లేదు. ఇదిలా ఉంటే కోవడ్ సోకిన వారిని దీర్ఘకాలం సైడ్ ఎఫెక్టులతో బాధపడుతున్నారు.