మ్యూచువల్ ‘సర్వీస్ ప్రొటెక్షన్’పై ముందుకా.. వెనక్కా!

మ్యూచువల్ ‘సర్వీస్ ప్రొటెక్షన్’పై ముందుకా.. వెనక్కా!
  • జీవో 402పై హైకోర్టు స్టే
  • ఇంకా స్పందించని సర్కార్

హైదరాబాద్,వెలుగు : రాష్ట్రంలో ఎంప్లాయీస్ మ్యూచువల్ బదిలీల సర్వీస్ ప్రొటెక్షన్​పై సర్కారు స్పందన కరువైంది. దీనిపై హైకోర్టు స్టే ఇచ్చి పది రోజులు దాటినా కనీసం ఆ విషయంపై ఆయా డిపార్ట్​మెంట్ల అధికారులతో సమీక్ష చేయలేదు. జీవో జారీ చేసింది జీఏడీ కావడంతో.. తమకేమీ సంబంధం లేదని ఇతర డిపార్ట్ మెంట్ అధికారులు చెప్తున్నారు. దీంతో సర్వీస్ ప్రొటెక్షన్ జీవోపై సర్కారు ముందుకు పోతుందా లేదా వెనక్కి తగ్గుతుందా అనే దానిపై ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది.

పెండింగ్ లో 5వేల అప్లికేషన్లు

జీవో 317తో ఉద్యోగులను సొంత జిల్లాలకు అలాట్ చేశారు. అయితే కొంత మంది ఇతర జిల్లాల్లోనే ఉండిపోవడంతో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ఒత్తిడితో మ్యూచువల్ బదిలీలకు అంగీకరిస్తూ ప్రభుత్వం జీవో 21ని జారీ చేసింది. ఈ జీవోతో ఉమ్మడి జిల్లాల్లో బదిలీ అయినా సర్వీస్ పోతోందని, సీనియర్లు కాస్తా జూనియర్లుగా మారిపోతున్నారంటూ యూనియన్లు సర్కారుకు విజ్ఞప్తి చేశాయి. దీంతో ఉమ్మడి జిల్లాల్లో జరిగే బదిలీలకు సర్వీస్ ప్రొటెక్షన్ ఉంటుందని చెప్తూ జీవో 21ని సవరించి జీవో 402ను జారీ చేసింది.దీని ప్రకారం 5 వేల అప్లికేషన్లు రాగా, అందులో టీచర్లవే 2,900 వరకు ఉండటం గమనార్హం.