ఆర్​బీఐ ఎంపీసీ మీటింగ్​ షురూ

ఆర్​బీఐ ఎంపీసీ మీటింగ్​ షురూ

ముంబై: రిజర్వ్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా (ఆర్​బీఐ) మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) మీటింగ్​ మంగళవారం మొదలైంది. ఆరుగురు మెంబర్లుండే ఈ ఎంపీసీ నిర్ణయాన్ని గురువారం ఉదయం ఆర్​బీఐ గవర్నర్​ శక్తికాంతదాస్​ ప్రకటించనున్నారు. ఈసారి కూడా వడ్డీ రేట్లను ఎంపీసీ మార్చకపోవచ్చని, యధాతథంగానే కొనసాగించే అవకాశాలు ఎక్కువని ఎక్స్​పర్టులు చెబుతున్నారు. 

రేట్ల పెరుగుదల (ఇన్​ఫ్లేషన్​) భయాలతోపాటు, అప్పులపై వడ్డీ రేట్లు నిలకడగా ఉంటేనే ఎకానమీలో  గ్రోత్​ మొమెంటమ్​ సాధ్యమవుతుందనే ఉద్దేశంతో  ఏప్రిల్​, జూన్​ మీటింగ్​లలో  రెపో రేటులో ఎలాంటి మార్పులను ఆర్​బీఐ చేయలేదు. ఇటీవల భారీగా పెరిగిన టమోట రేట్ల కారణంగా వెంటనే వడ్డీ రేట్లను ఆర్​బీఐ పెంచుతుందని తాము అనుకోవడం లేదని బ్యాంక్​ ఆఫ్​ అమెరికా ఒక రిపోర్టులో పేర్కొంది. 

వడ్డీ రేట్లతోపాటు, పాలసీ విషయంలోనూ ఆర్​బీఐ  స్టేటస్​కో మెయింటెయిన్​ చేస్తుందనే ఎనలిస్టులు అంచనా వేస్తున్నట్లు హౌసింగ్​.కామ్​ గ్రూప్​ సీఈఓ ధృవ్​ అగర్వాలా చెప్పారు. కూరగాయలు సహా  కొన్ని  ఫుడ్​ ఐటమ్స్​రేట్లు ఇటీవలి కాలంలో బాగా పెరగడాన్ని  ఆర్​బీఐ  లోతుగా విశ్లేషిస్తోందని పేర్కొన్నారు.