దర్యాప్తు పూర్తయింది.. త్వరలోనే నివేదిక

దర్యాప్తు పూర్తయింది.. త్వరలోనే నివేదిక

న్యూఢిల్లీ:  తమిళనాడులో సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ క్రాష్​అయిన ఘటనపై దర్యాప్తు పూర్తయిందని, ఎయిర్ చీఫ్​మార్షల్ వీఆర్ చౌధరికి మరో ఐదు రోజుల్లో నివేదిక అందనుందని ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. డిసెంబర్ 8న తమిళనాడులోని నీలగిరి హిల్స్ లో ఆర్మీ హెలికాప్టర్ కూలిపోవడంతో జనరల్ రావత్, ఆయన భార్యతో సహా మొత్తం 14 మంది మరణించారు. ఈ ఘటనపై దర్యాప్తు, నివేదికకు సంబంధించి ఇప్పటివరకు అటు ప్రభుత్వం గానీ, ఇటు ఎయిర్ ఫోర్స్ గానీ ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. అయితే ఆ రోజు వాతావరణం బాగలేకపోవడంతో దట్టమైన పొగమంచు కారణంగా ముందు ఏమీ కనిపించని పరిస్థితి ఉందని, హెలికాప్టర్ క్రాష్​కావడానికి ఇదే కారణం కావచ్చని ఆర్మీ వర్గాలు చెప్పాయి. బ్యాడ్ వెదర్ కారణంగానే అనుకోకుండా హెలికాప్టర్ చెట్లను ఢీకొట్టి క్రాష్​అయి ఉండొచ్చని ఎయిర్ మార్షల్ మానవేంద్ర సింగ్ ఆధ్వర్యంలో జరిగిన కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీలో ఒక నిర్ణయానికి వచ్చారని చెప్తున్నారు. హెలికాప్టర్ లో టెక్నికల్, మెకానికల్ డిఫెక్ట్స్ కు ఎలాంటి అవకాశం లేదని వారు స్పష్టం చేస్తున్నారు.