Bade Miyan Chote Miyan OTT: OTTకి రూ.350 కోట్ల సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడ? ఎప్పుడు?

Bade Miyan Chote Miyan OTT: OTTకి రూ.350 కోట్ల సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడ? ఎప్పుడు?

బాలీవుడ్ స్టార్స్ అక్షయ్ కుమార్(Akshay kumar), టైగర్ ష్రాఫ్(Tiger shraf) హీరోలుగా వచ్చిన లేటెస్ట్ మూవీ బడేమియా ఛోటేమియా(Bade Miyan Chote Miyan). స్టార్ డైరెక్టర్ ఆలీ అబ్బాస్ జాఫర్ తెరకెక్కించిన ఆ భారీ యాక్షన్ మూవీలో కియారా అద్వానీ, మనుషి చిల్లర్ హీరోయిన్స్ గా నటించారు. మలయాళ స్టార్ పృద్విరాజ్ సుకుమారన్ విలన్ గా చేసిన ఈ సినిమాలో సోనాక్షి సిన్హా కీ రోల్ చేసింది. టీజర్, ట్రైలర్ తో భారీ అంచనాలు క్రియేట్ చేసిన ఈ సినిమా ఏప్రిల్ 11న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

కానీ, విడుదల తరువాత మాత్రం ఆ అంచనాలను అందుకోలేకపోయింది ఈ మూవీ. బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా అక్షయ్ కుమార్ కెరీర్ లో మరో డిజాస్టర్ గా నిలిచింది. దాదాపు రూ.350 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా మినిమమ్ కలెక్షన్స్ కూడా రాబట్టలేకపోయింది. కేవలం రూ.90 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసి ఈ ఇయర్ బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది.

ఇక సినిమా భారీ పరాజయాన్ని అందుకున్న కారణంగా ఇపుడు ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ సంస్థ నెట్ఫ్లిక్స్ దక్కించుకున్న విషయం తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం.. బడేమియా ఛోటేమియా జూన్ 6 నుండి ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందట. మరి థియేటర్స్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచిన ఈ సినిమాకు ఓటీటీలో ఎలాంటి రిజల్ట్ అనుకోనుందో చూడాలి.