బ్యాడ్మింటన్ ఆసియా అండర్-15, 17 చాంపియన్షిప్.. క్వార్టర్స్‌లో షైనా

బ్యాడ్మింటన్ ఆసియా అండర్-15, 17 చాంపియన్షిప్.. క్వార్టర్స్‌లో షైనా

చెంగ్డూ (చైనా): బ్యాడ్మింటన్‌‌‌‌‌‌‌‌ ఆసియా అండర్‌‌‌‌‌‌‌‌–15, 17 చాంపియన్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌లో ఇండియా షట్లరు మెరిశారు. శుక్రవారం (అక్టోబర్ 24) జరిగిన అండర్‌‌‌‌‌‌‌‌-–15 గర్ల్స్‌‌  ప్రిక్వార్టర్స్‌‌‌‌‌‌‌‌లో షైనా ముత్తుమణి 21–-17, 21–-16తో లీ మాన్‌‌‌‌‌‌‌‌ లిన్‌‌‌‌‌‌‌‌ (చైనా) గెలిచి క్వార్టర్స్‌‌‌‌‌‌‌‌లోకి ప్రవేశించింది. బాలికల డబుల్స్‌‌‌‌‌‌‌‌లో అదితి దీపక్‌‌‌‌‌‌‌‌ రాజ్‌‌‌‌‌‌‌‌–-బీవీ పొన్నమ్మ వ్రిధి 17-–21, 21–-15, 21–-17తో లీ యున్‌‌‌‌‌‌‌‌ సియో-–పార్క్‌‌‌‌‌‌‌‌ యూ జీయోంగ్‌‌‌‌‌‌‌‌ (కొరియా)పై నెగ్గారు.

 బాయ్స్‌‌‌‌‌‌‌‌ డబుల్స్‌‌‌‌‌‌‌‌లో చరణ్‌‌‌‌‌‌‌‌ రామ్‌‌‌‌‌‌‌‌ తిప్పన్న–-హరి కృష్ణ 21–-14, 21–-8తో కొసుకి షినోహర–-హిరోటో నకాట్సుకా (జపాన్‌‌‌‌‌‌‌‌)పై గెలిచారు. బాయ్స్‌‌‌‌‌‌‌‌ సింగిల్స్‌‌‌‌‌‌‌‌లో జగ్షేర్‌‌‌‌‌‌‌‌ సింగ్‌‌‌‌‌‌‌‌ కంగురా 21–-12, 21–-17తో విన్సన్‌‌‌‌‌‌‌‌ చోహ్‌‌‌‌‌‌‌‌ (మలేసియా)పై గెలవగా, వాజిర్‌‌‌‌‌‌‌‌ సింగ్‌‌‌‌‌‌‌‌ 19–-21, 22–-20, 22–-24తో ఏడోసీడ్‌‌‌‌‌‌‌‌ రేవన్‌‌‌‌‌‌‌‌ అడ్రిలియో సపుత్రా (ఇండోనేసియా) చేతిలో ఓడాడు.  

అండర్‌‌‌‌‌‌‌‌–17 బాలికల  ప్రిక్వార్టర్స్‌‌‌‌‌‌‌‌లో లక్ష్య రాజేశ్‌‌‌‌‌‌‌‌ 21–16, 21–11తో లీ యున్‌‌‌‌‌‌‌‌ సియోన్‌‌‌‌‌‌‌‌ (కొరియా)పై నెగ్గి క్వార్టర్‌‌‌‌‌‌‌‌ఫైనల్లోకి అడుగుపెట్టింది. ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన ఇండియన్‌‌‌‌‌‌‌‌ ప్లేయర్‌‌‌‌‌‌‌‌ కీలక టైమ్‌‌‌‌‌‌‌‌లో వరుసగా పాయింట్లు సాధించింది. తొలి గేమ్‌‌‌‌‌‌‌‌లో కాస్త పోటీ ఎదుర్కొన్నా.. రెండో గేమ్‌‌‌‌‌‌‌‌లో ఈజీగా ప్రత్యర్థికి చెక్‌‌‌‌‌‌‌‌ పెట్టింది. మరో మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో ఆరోసీడ్‌‌‌‌‌‌‌‌ దీక్ష 21–19, 21–15తో పిన్‌‌‌‌‌‌‌‌ సుయాన్‌‌‌‌‌‌‌‌ చియాంగ్‌‌‌‌‌‌‌‌ (చైనీస్‌‌‌‌‌‌‌‌తైపీ)ని చిత్తు చేసి ముందంజ వేసింది.