బ్యాడ్మింటన్‌‌‌‌ ఇంటర్నేషనల్‌‌‌‌ టోర్నీ.. ప్రమోద్‌‌‌‌కు రెండు గోల్డ్‌‌‌‌ మెడల్స్‌‌‌‌

బ్యాడ్మింటన్‌‌‌‌ ఇంటర్నేషనల్‌‌‌‌ టోర్నీ.. ప్రమోద్‌‌‌‌కు రెండు గోల్డ్‌‌‌‌ మెడల్స్‌‌‌‌

విక్టోరియా: ఇండియా పారా అథ్లెట్లు ప్రమోద్‌‌‌‌ భగత్‌‌‌‌.. ఆస్ట్రేలియా పారా బ్యాడ్మింటన్‌‌‌‌ ఇంటర్నేషనల్‌‌‌‌ టోర్నీలో రెండు గోల్డ్‌‌‌‌ మెడల్స్‌‌‌‌తో మెరిశాడు. శనివారం (అక్టోబర్ 25) జరిగిన మెన్స్‌‌‌‌ సింగిల్స్‌‌‌‌ ఎస్‌‌‌‌ఎల్‌‌‌‌3 ఫైనల్లో ప్రమోద్‌‌‌‌ 21–15, 21–17తో మనోజ్‌‌‌‌ సర్కార్‌‌‌‌పై గెలిచాడు. డబుల్స్‌‌‌‌ ఎస్‌‌‌‌ఎల్‌‌‌‌3–ఎస్‌‌‌‌ఎల్‌‌‌‌4లో టైటిల్‌‌‌‌ ఫైట్‌‌‌‌లో ప్రమోద్‌‌‌‌–సుకాంత్‌‌‌‌ 21–11, 19–21, 21–18తో విక్రమ్‌‌‌‌ కుమార్‌‌‌‌–సూర్య కాంత్‌‌‌‌ యాదవ్‌‌‌‌ను ఓడించారు. 

మెన్స్‌‌‌‌ సింగిల్స్‌‌‌‌ ఎస్‌‌‌‌ఎల్‌‌‌‌4 ఫైనల్లో సుకాంత్‌‌‌‌ 21–23, 21–14, 19–21తో సూర్య కాంత్‌‌‌‌ చేతిలో ఓడి సిల్వర్‌‌‌‌తో సరిపెట్టుకున్నాడు. విమెన్స్‌‌‌‌ సింగిల్స్‌‌‌‌ ఎస్‌‌‌‌ఎల్‌‌‌‌3లో స్వర్ణం గెలిచిన మానసి జోషి.. మిక్స్‌‌‌‌డ్‌‌‌‌ డబుల్స్‌‌‌‌ ఎస్‌‌‌‌ఎల్‌‌‌‌3–ఎస్‌‌‌‌యూ5లో రుతిక్‌‌‌‌ రఘుపతితో జోడీ కట్టి గోల్డ్‌‌‌‌ మెడల్‌‌‌‌ను సాధించింది. 

మెన్స్‌‌‌‌ డబుల్స్‌‌‌‌ ఎస్‌‌‌‌యూ5 టైటిల్‌‌‌‌ ఫైట్‌‌‌‌లో రుతిక్‌‌‌‌ రఘుపతి–చిరాగ్‌‌‌‌ భరెతా ద్వయం బంగారు పతకం సాధించారు. మెన్స్‌‌‌‌ డబుల్స్‌‌‌‌ ఎస్‌‌‌‌హెచ్‌‌‌‌6లో శివరంజన్‌‌‌‌ సోలైమలై–సుదర్శన్‌‌‌‌ ముత్తుస్వామి గోల్డ్‌‌‌‌ మెడల్‌‌‌‌ నెగ్గారు.