కేపీ చౌదరి తెలుసు.. డ్రగ్స్ అమ్ముతాడని తెలియదు : సిక్కిరెడ్డి తల్లి

కేపీ చౌదరి తెలుసు.. డ్రగ్స్ అమ్ముతాడని తెలియదు : సిక్కిరెడ్డి తల్లి

టాలీవడ్ నిర్మాత కేపీ చౌదరి డ్రగ్స్ వ్యవహారంలో బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సిక్కిరెడ్డి పేరు రావడంపై ఆమె తల్లి మాధవి మండిపడ్డారు. తమ నివాసంలో  డ్రగ్స్ పార్టీలు జరిగాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆమె స్పందించాడు.." మాకు కేపీ చౌదరి తెలుసు కానీ.. అతను ఇలాంటి వాడు అని తెలియదు. మేము 2013లో అత్తాపూర్ లో ఉన్నప్పుడు మేము ఉండే ఆపార్ట్మెంట్ లోనే కేపీ చౌదరి ఉండేవాడు. అలా మాకు అతను పరిచయం. ఆతరువాత కొంతకాలానికి మేము మాదాపూర్ కు షిఫ్ట్ అయ్యాము. అప్పటినుండి అతను మాకు కాంటాక్ట్ లో లేడు కానీ అప్పుడప్పుడు ఫోన్ లో మాట్లాడేవాడు. 2019లో సిక్కిరెడ్డి పెళ్లికి కూడా వచ్చాడు కేపీ చౌదరి.

ఇవి కూడా చదవండి:వరంగల్ లో మరో మెడికో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

అతను గోవాలో ఉంటున్న సంగతి మాకు తెలియదు. గతంలో అతనితో ఉన్న పరిచయంతోనే వారం రోజుల ఉండటానికి ఇళ్ళు ఇచ్చాం. ఆ ఇల్లు సిక్కిరెడ్డి పేరు మీదే ఉంది అందుకే ఈ వార్తలు వస్తున్నాయి. కానీ ఆ వార్తలన్నీ అబద్దం. ఆమె ఎక్కడికి వెళ్ళనా తన భర్తతోనే వెళుతుంది. సిక్కిరెడ్డికి ఈ వ్యవాహారంతో ఎలాంటి సంబంధంలేదు. ప్రస్తుతం ఆమె గేమ్ పైనే దృష్టి పెట్టింది. అందుకోసం చాల కష్టపడుతోంది. అనవసరమైన వాటిలోకి ఆమెకు లాగకండి అంటూ ఆవేదన వ్యక్తం చేసింది సిక్కిరెడ్డి తల్లి మాధవి.