
అంజలి లీడ్ రోల్‌లో తెరకెక్కిన వెబ్ సిరీస్ ‘బహిష్కరణ’. ముఖేష్ ప్రజాపతి దర్శకుడు. విలేజ్ రివేంజ్ డ్రామా జానర్‌లో వస్తున్న ఈ వెబ్ సిరీస్ జులై 19 నుంచి జీ 5లో స్ట్రీమింగ్ కానుంది. బుధవారం ట్రైలర్‌ను హీరో నాగార్జున విడుదల చేసి, బెస్ట్ విషెస్ చెప్పారు. ‘మంచోడు చేసే తప్పేంటో తెలుసా.. చెడ్డోడి చరిత్ర గురించి తెలుసుకోవటం’ అనే డైలాగ్‌తో ట్రైలర్ మొదలైంది.
పల్లెటూర్లో అంజలి, శ్రీతేజ్, అనన్య నాగళ్ల పాత్రలను పరిచయం చేశారు. ఎంతో సంతోషంగా ఉంటున్న వారి జీవితాల్లో ఆ ఊరి పెద్ద రవీంద్ర విజయ్, అతని మనుషుల దురాగతాలతో అలజడి రేగుతుంది. ఓ వైపు ప్రేమ, మరోవైపు ఆవేశం కలగలిసిన పుష్ప అనే పాత్రలో అంజలి నటన ఆకట్టుకుంది. ఆ గ్రామానికి ఆమె ఎందుకు వచ్చింది.. ఎవరిపై ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటోంది అనే అంశాలు ఆసక్తి రేపుతున్నాయి.