అయోధ్య రాముడికి.. 108 అడుగుల అగర్​బత్తి

అయోధ్య రాముడికి.. 108 అడుగుల అగర్​బత్తి

అయోధ్య రామ మందిరానికి గుజరాత్​కి చెందిన కొందరు భక్తులు భారీ అగర్​బత్తి తయారు చేశారు. దీని పొడవు 108 అడుగులు. మీరు విన్నది నిజమే.. దాని వివరాలేంటో చూసేద్దాం పదండీ.
గుజరాత్​ వడోదరాలోని తర్సాలీ గ్రామానికి చెందిన రామ భక్తులు అయోధ్య రామ మందిరానికి తమ వంతుగా ఏదైనా మరిచిపోలేని కానుక ఇవ్వాలనుకున్నారు. ఈ క్రమంలో భారీ అగర్​బత్తి తయారు చేద్దామని నిర్ణయించుకున్నారు. 108 అడుగుల పొడవు, 3,403 కిలోల బరువున్న అగర్​బత్తి తయారు చేసి రామ భక్తి చాటుకున్నారు. విహాభాయ్​ బర్వాడ్​అనే గ్రామస్థుడి నేతృత్వంలో దీనిని పంచద్రవ్యాలతో మలిచారు.  ఈ ఏడాది డిసెంబర్​నాటికి అయోధ్యకు పంపించాలని ప్రణాళిక వేస్తున్నారు. దీని తయారికి రెండు నెలల సమయం పట్టింది. 

అగర్​బత్తి వివరాలివే..

గ్రామస్థుడు విహాభాయ్ బర్వాడ్​ మాట్లాడుతూ.. 'అయోధ్యలో భక్తుల సమక్షంలో 3.5 అడుగుల చుట్టు కొలత కలిగిన ఈ అగర్ బత్తిని వెలిగిస్తాం. పంచ ద్రవ్యాలతో తయారు చేసిన దీనిని తయారు చేసేందుకు 191 కిలోల ఆవు నెయ్యి, 376 కిలోల గుగ్గిలం, 280 కిలోల బార్లీ, 280 కేజీల నువ్వులు, 376 కిలోల కొబ్బరి పొడి, 425 కిలోల పూర్ణాహుతి సామగ్రి, 1,475 కిలోల ఆవు పేడ వాడాం. దాదాపు రూ.5 లక్షలు ఖర్చైంది. తరలించడానికి మరో రూ.4.5 లక్షలు ఖర్చవుతుంది. అక్కడ జరిగే కార్యక్రమానికి గుజరాత్​ సీఎం భూపేంద్ర పటేల్​ను ఆహ్వానిస్తాం' అని చెప్పారు.