గన్పార్క్​ వద్ద మొదలైన బహుజన బతుకమ్మ సంబురాలు

గన్పార్క్​ వద్ద మొదలైన బహుజన బతుకమ్మ సంబురాలు

హైదరాబాద్​ లో బహుజన బతుకమ్మ సంబురాలు మొదలయ్యాయి. గన్ పార్క్ వద్ద నివాళులర్పించిన తర్వాత అరుణోదయ కళాకారిణి విమలక్క బతుకమ్మ సంబరాలను ప్రారంభించారు. మొదటి రోజు హైదరాబాద్ ఆర్ట్స్ కాలేజీలో ఆట, పాటలతో మొదలయ్యే బతుకమ్మ సంబురాలు.. జిల్లా స్థాయిలో తొమ్మిది రోజుల పాటు జరగనున్నాయి. మద్యం మత్తు వీడటంతో పాటు, స్త్రీలపై అఘాయిత్యాలు ఆపాలి అన్న అంశాలను బలంగా జనాల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు విమలక్క. 

తెలంగాణ అమరవీరుల ఆశయాలను ముందుకు తీసుకెళ్తామన్నారు విమలక్క. మలిదశ తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బతుకమ్మ సంబరాలు మొదలుపెట్టామన్నారు. బతుకమ్మకే బతుకు లేకుండా చేసే పరిస్థితులు నేడు సమాజంలో నెలకొన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆడబిడ్డలకు, బతుకమ్మకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేస్తూ బహుజన బతకమ్మ సంబరాలు నిర్వహిస్తున్నామన్నారు. 

బహుజన బతుకమ్మతో విప్లవాత్మక మార్పులను తీసుకొస్తున్నామని చెప్పారు. సమాజంలో మార్పు రావాలంటే ప్రభుత్వాలు మారాలని, ప్రజల్లో చైతన్యం రావాలని పిలుపునిచ్చారు.  సమాజంలో మార్పు రావాలంటే అందరూ పూర్తి బాధ్యత వహించాలని కోరారు.