ఉద్యోగులకు శాలరీస్‌‌‌‌ ఇవ్వలేం... బైజూస్ ప్రకటన

ఉద్యోగులకు శాలరీస్‌‌‌‌ ఇవ్వలేం... బైజూస్  ప్రకటన
  • రైట్స్ ఇష్యూ ఫండ్స్ వాడుకోలేకపోతున్నామన్న సీఈఓ రవీంద్రన్‌‌‌‌

న్యూఢిల్లీ: ఉద్యోగులకు శాలరీస్‌‌‌‌ ఇవ్వలేమని బైజూస్ సీఈఓ  బైజూ రవీంద్రన్‌‌‌‌  ప్రకటించారు.  కొంత మంది ఇన్వెస్టర్లతో   నెలకొన్న  గొడవ  కారణంగా తాజాగా సేకరించిన రైట్స్‌‌‌‌ ఇష్యూ ఫండ్స్‌‌‌‌ వాడుకోలేకపోతున్నామని చెప్పారు.  కంపెనీ  రైట్స్ ఇష్యూ ద్వారా రూ.1,660 కోట్ల (200 మిలియన్ డాలర్ల) ను  సక్సెస్‌‌‌‌ఫుల్‌‌‌‌గా సేకరించింది.  ‘షార్ట్‌‌‌‌ టెర్మ్‌‌‌‌లో అవసరాలను చేరుకోవడానికి మన దగ్గర ఫండ్స్ ఉన్నాయి. 

కానీ, మీ శాలరీస్ ఇవ్వలేమని  చెప్పడానికి బాధగా ఉంది’ అని  ఉద్యోగులకు ఆయన వివరించారు. ఈ నెల 10 లోపు జీతాలు వేసేలా  చూస్తామన్నారు.  కాగా,  బైజూస్ రైట్స్ ఇష్యూ చెల్లదని చెబుతూ దీనిపై కర్నాటక హైకోర్టులో కొంత మంది కంపెనీ ఇన్వెస్టర్లు పిటిషన్ వేశారు.  అలానే రవీంద్రన్‌‌‌‌, ఆయన ఫ్యామిలీని కంపెనీ నుంచి తొలగించేందుకు జరిగిన  ఎక్స్‌‌‌‌ట్రార్డినరీ జనరల్ మీటింగ్ (ఈజీఎం) పై కూడా కోర్టు ఈ నెల 10 న  హియరింగ్‌‌‌‌ చేపట్టనుంది. మరోవైపు రైట్స్ ఇష్యూ ఫండ్స్‌‌‌‌ విత్‌‌‌‌డ్రా చేయడానికి వీలు లేదని బైజూస్‌‌‌‌ను ఎన్‌‌‌‌సీఎల్‌‌‌‌టీ బెంగళూరు బెంచ్ ఆదేశించింది. 

ఫండ్స్‌‌‌‌ను డిఫరెంట్ అకౌంట్లలో ఉంచాలని తీర్పిచ్చింది.  ‘ 150 మంది ఇన్వెస్టర్లలో నలుగురి వలన  మీరు కష్టపడి సంపాదించిన జీతాలను మీకు వేయలేకపోతున్నాం. సేకరించిన ఫండ్స్‌‌‌‌ను ఇందుకోసం వాడుకోలేకపోతున్నాం’ అని ఉద్యోగులకు రాసిన లెటర్‌‌‌‌‌‌‌‌లో రవీంద్రన్ పేర్కొన్నారు. ‘నిజానికి ఇందులో కొంతమంది ఇన్వెస్టర్లు కంపెనీలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా భారీ లాభాలు చూశారు. ఒకరైతే పెట్టుబడిపైన ఎనిమిది రెట్ల ప్రాఫిట్ పొందారు. ఇప్పుడు వీరు  మన జీవితాలను పట్టించుకోవడం లేదు’ అని అన్నారు.