భూసేకరణ పరిహారం కేసులో..సిరిసిల్ల కలెక్టర్‌‌కు బెయిలబుల్‌‌ వారెంట్‌‌

భూసేకరణ పరిహారం కేసులో..సిరిసిల్ల కలెక్టర్‌‌కు బెయిలబుల్‌‌ వారెంట్‌‌
  •  అక్టోబరు 8న హాజరుపర్చాలంటూ హైకోర్టు ఆదేశం

హైదరాబాద్, వెలుగు: భూసేకరణ పరిహారం చెల్లించాలంటూ ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయని రాజన్న సిరిసిల్ల కలెక్టర్​పై  హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. గతంలో ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయకపోగా వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వకపోవడంపై మండిపడింది. వీరిద్దరికి బెయిలబుల్‌‌ వారెంట్‌‌లు జారీ చేస్తూ ఆదేశాలిచ్చింది. అక్టోబరు 8న హాజరయ్యేలా వారెంట్‌‌ జారీ చేయాలని రిజిస్ట్రీకి స్పష్టం చేసింది. 

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగాలపల్లి మండలం, చీర్లవంచ గ్రామానికి చెందిన వేపుల ఎల్లయ్య పరిహారం నిమిత్తం హైకోర్టులో పిటిషన్‌‌ వేశారు. దీనిపై హైకోర్టు విచారణ చేపట్టి 4 వారాల్లో రూ.7.86 లక్షలు పరిహారం చెల్లించాలంటూ ఆదేశాలిచ్చింది. ఈ పిటిషన్‌‌పై జస్టిస్‌‌ ఎన్‌‌.వి. శ్రవణ్‌‌కుమార్‌‌ ఈ నెల 3న మరోసారి విచారించి గత జూన్‌‌లో వెలువరించిన ఉత్తర్వులను అమలు చేయడానికి మరో 2 వారాల గడువు కావాలని ప్రభుత్వ న్యాయవాది కోరారు. దీనికి న్యాయమూర్తి అనుమతిస్తూ పరిహారం చెల్లించాలని.. లేదంటే కలెక్టర్  వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించారు. ఈ పిటిషన్‌‌ ను న్యాయమూర్తి బుధవారం మరోసారి విచారించి గత ఉత్తర్వులను అమలుచేయకపోవడంపై ఫైర్ అయింది.