తహశీల్దార్ ద్వారా కుల సర్టిఫికెట్ ఇప్పించాలి : బైరి వెంకటేశం మోచి  

తహశీల్దార్ ద్వారా కుల సర్టిఫికెట్ ఇప్పించాలి : బైరి వెంకటేశం మోచి  

ఖైరతాబాద్​,వెలుగు: ఎస్సీ ఉప కులాలకు తహశీల్దార్ ద్వారా కులధ్రువీకరణ పత్రం జారీ అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఎస్సీ 57 ఉపకులాల హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు బైరి వెంకటేశం మోచి ప్రభుత్వాన్ని కోరారు. ప్రస్తుతం ఆర్డీవో ద్వారా ఇస్తుండగా క్యాస్ట్ సర్టిఫికెట్ ​రావడానికి చాలా రోజులు పడుతుందని, దీంతో విద్యార్థులు ఇబ్బందులు  ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఎస్సీ 57 ఉపకులాల నేతలతో  ఆదివారం సోమాజిగూడ ప్రెస్​క్లబ్ లో  రౌండ్​టేబుల్​సమావేశం జరిగింది. ఇందులో పాల్గొన్న పలు ఎస్సీ ఉపకులాల సంఘాల నేతలు మాట్లాడుతూ.. కాంగ్రెస్​ఎస్సీ డిక్లరేషన్​లో భాగంగా  మాల, మాదిగ, ఉప కులాలకు 3 కార్పొరేషన్ల ఏర్పాటు హామీ మేరకు పెట్టి.. రూ.750 కోట్ల నిధులు మంజూరు చేయాలని కోరారు.

వర్గీకరణ జరిగితే ఎస్సీ 57 ఉపకులాలను –ఏ కేటగిరిలో చేర్చి, జనాభా దామాషా మేరకు 7 శాతం రిజర్వేషన్​కల్పించాలని పేర్కొన్నారు. ఎస్సీ ఉప కులాల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరిస్తే వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్​అభ్యర్థుల విజయానికి కృషిచేస్తామని ప్రకటించారు. ఈ సమావేశంలో పలు సంఘాల నేతలు టీఎన్​స్వామి,  కర్నె రామారావు, చంద్రగిరి సత్యనారాయణ, నాగయ్య స్వామి,శివకుమార్​ తదితరులు పాల్గొన్నారు.