డిజిటల్ డిస్ ప్లే, బ్లూటూత్ కనెక్టివిటీతో..Bajaj Pulsar N150, N160 త్వరలో లాంచ్..

డిజిటల్ డిస్ ప్లే, బ్లూటూత్ కనెక్టివిటీతో..Bajaj Pulsar N150, N160 త్వరలో లాంచ్..

ఎంతాగానో ఎదురు చూస్తున్న బజాజ్ పల్సర్ లేటెస్ట్ బైక్స్ Pulsar N150,Pulsar N160  త్వరలో లాంచ్ కాబోతున్నాయి. ముందు చెప్పినట్టుగానే Pulsar N150 అప్ డేట్లతో వస్తోంది. బ్లూటూత్ కనెక్టివితో డిజిజల్ డిస్ ప్లే, సింగిల్ ఛానెల్ ABS కొనసాగిస్తూ కొత్త లుక్ తో పల్సర్ మోడళ్లు వస్తున్నాయి. 

Bajaj Pulsar N150, N160లను త్వరలో లాంచ్ చేయనున్నారు. బజాస్ పల్సర్ N150 కేవలం 1వేరియంట్, రెండు రంగుల్లో మాత్రమే అందుబాటులోకి వస్తున్న స్ట్రీట్ బైక్.ఇది 149.68 సీసీ BS6 ఇంజిన్ తో 14.3 bhp ఎనర్జీతో 13.5 Nm టార్క్ ను అందిస్తుంది. ముందు డిస్క్ బ్రేక్స్, వెనక డ్రమ్ బ్రేక్ లతో యాంటీ లాకింగ్ బ్రేకింగ్ సిస్టమ్ తో వస్తోంది. ఇది భారతీయ మార్కెట్లో ఉన్న బజాజ్ తాజా 150సిసి బైక్. ఈ పల్సర్ ఎన్ 160 బైక్ బరువు 152 కిలోలు, ఇంధనట్యాంక్ సామర్థ్యం 14 లీటర్లు. 

అదే బజాస్ పల్సర్ N160 అయితే 2 వేరియంట్ లు, మూడు రంగుల్లో లభిస్తోంది. 164.82 సిసి BS6 ఇంజన్ తో 15.68 bhp ఎనర్జీ, 14.65Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ముందు, వెనక డిస్క్ బ్రేకులతో, యాంటీ లాగింగ్ బ్రేకింగ్ సిస్టమ్ తో వస్తోంది. ఈ పల్సర్ ఎన్ 160 బైక్ బరువు 152 కిలోలు, ఇంధనట్యాంక్ సామర్థ్యం 14 లీటర్లు. 

ఇది LED డిస్ ప్లే, స్పీడోమీటర్, ఓడోమీటర్, ట్రిప్ మీటర్, ఫ్యుయెల్ ఇండిరేటర్, వాచ్ వంటి రీడౌట్ లతో సెమీ డిజిటల్ ఇన్ స్ట్రుమెంట్ కన్సోల్ కలిగిఉంటుంది. సేఫ్టీ విషయానికొస్తే సింగిల్ ఛానల్ ABS, సైడ్ స్టాండ్ కట్ ఆఫ్ సెన్సార్ ఉంటుంది. 

కొత్త పల్సర్ బైక్ N150లో 149.6 సిసి సింగిల్ సిలిండర్ ఇంజన్ తో 8,500 rpm వద్ద 14.5bhp, 6000rpm వద్ద 13.5 Nm ని అభివృద్ది చేస్తుంది.మోటార్ ఐదు స్పీడ్ గేర్ బాక్స్ తో జత చేయబడి ఉంటుంది. P150 పల్సర్ మాదిరిగానే N150  కూడా అదే శక్తి, టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. 

బజాజ్ పల్సర్ N160 బైక్ పల్సర్ ఎన్ 250 మాదిరిగానే ఉంటుంది. ఇది ముందు భాగంలో LED DRLలతో అదే ప్రాజెక్టర్ LED హెడ్ లైట్ ని పొందుతుంది. సైడ్ ప్యానెల్స్, మొత్తం డిజైన్ కూడా 250 సిసి పల్సర్ నుంచి తీసుకోబడ్డాయి.

టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్ , డ్యుయెల్ రియర్ సస్పెన్షన్ బజాజ్ పల్సర్ N150లో ఉంటాయి.

  • బజాజ్ పల్సర్ N150  ప్రారంభ ధర రూ. 1,17,134(ఎక్స్ షోరూమ్) 
  • బజాజ్ పల్సర్ N150 స్టాండర్డ్ వేరియంట్ ధర రూ. 1,18,436 (ఎక్స్ షోరూమ్ )
  • బజాజ్ పల్సర్ N160 ప్రారంభ ధర రూ. 1,22,854(ఎక్స్ షోరూమ్)