నవ్వించే బద్మాషులు.. ఇంటరెస్టింగ్‌‌ కంటెంట్‌‌తో ట్రైలర్‌‌‌‌: దర్శకుడు ‘బలగం’ వేణు

నవ్వించే బద్మాషులు.. ఇంటరెస్టింగ్‌‌ కంటెంట్‌‌తో ట్రైలర్‌‌‌‌: దర్శకుడు ‘బలగం’ వేణు

మహేష్ చింతల, విద్యాసాగర్ కారంపురి, మురళీధర్ గౌడ్ లీడ్ రోల్స్‌‌లో శంకర్ చేగూరి తెరకెక్కించిన చిత్రం ‘బద్మాషులు’.తార స్టోరీ టెల్లర్స్ బ్యానర్‌‌‌‌పై బి. బాలకృష్ణ, సి.రామ శంకర్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే టీజర్‌‌‌‌తో ఆకట్టుకున్న మేకర్స్.. సోమవారం ట్రైలర్‌‌‌‌ను విడుదల చేశారు.

దర్శకుడు ‘బలగం’ వేణు ట్రైలర్‌‌‌‌ను విడుదల చేశాడు. అనంతరం వేణు మాట్లాడుతూ ‘ట్రైలర్‌‌‌‌ చూస్తుంటే ఇంటరెస్టింగ్‌‌ కంటెంట్‌‌తో ఫన్‌‌ రైడ్‌‌లా కనిపిస్తోంది. సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నా. అలాగే ఇందులో నటించిన మహేష్ చింతర, విద్యాసాగర్‌‌‌‌కు నటులుగా మంచి పేరు రావాలని, దర్శకనిర్మాతలకు సక్సెస్ రావాలని ఆశిస్తున్నాను’అంటూ బెస్ట్ విషెస్ చెప్పాడు.

హండ్రెడ్ పర్సెంట్ జనాలను నవ్వించాలనే ఉద్దేశంతో ఈ చిత్రం తెరకెక్కించామని దర్శకనిర్మాతలు తెలియజేశారు.  గ్రామీణ నేపథ్యంలో ఆద్యంతం వినోద ప్రధానంగా సాగే ఈ కుటుంబ కథా చిత్రం జూన్ 6న దీపా ఆర్ట్స్ ద్వారా ఈ ప్రేక్షకుల ముందుకొస్తోంది.