
బలగం(Balagam) సినిమాతో జబర్దస్త్ వేణు కాస్త బలగం వేణు(Balagam Venu)గా మారిపోయాడు. ఫ్యామిలీ అండ్ ఎమోషనల్ బ్యాక్డ్రాప్ లో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర విజయాన్ని మాత్రమే కాదు.. ప్రతిష్టాత్మక అవార్డులను కూడా అందుకుంది. దాంతో బలగం వేణు పేరు ఇండస్ట్రీలో మోగిపోయింది. ఆయన తరువాత సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తినెలకొంది. ఈ క్రమంలోనే తనకు మొదటి సినిమా అవకాశం ఇచ్చిన నిర్మాత దిల్ రాజుతోనే నెక్స్ట్ సినిమా చేయడానికి ఫిక్స్ అయ్యాడు.
అంతేకాదు.. తన తరువాతి సినిమా కోసం నేచురల్ స్టార్ నాని(Nani)ని ఎంచుకున్నాడు. ఎల్లమ్మ అనే టైటిల్ తో వస్తున్న ఈ సినిమాను నాని, దిల్ రాజు, వేణు ముగ్గురు కలిసి ఫోటో దిగి సోషల్ మీడియాలో షేర్ చేసి అధికారిక ప్రకటన ఇచ్చారు. దీంతో.. త్వరలోనే ఈ ప్రాజెక్టు మొదలుకానుందని ఆడియన్స్ అనుకున్నారు. కానీ, ఎల్లమ్మ ప్రాజెక్టు గురించి సోషల్ మీడియాలో మాత్రం ఒక న్యూస్ వైరల్ గా మారింది. అదేంటంటే.. ఇటీవల దర్శకుడు వేణు నానికి ఎల్లమ్మ సినిమా స్టోరీ డ్రాఫ్ట్ చెప్పాడట. అయితే.. వేణు చెప్పిన కథ నానికి పెద్దగా నచ్చలేదట. అందుకే.. ప్రస్తుతానికి ఈ ప్రాజెక్టును పక్కన పెట్టేశాడట నాని. అయితే.. ఈ విషయంపై మేకర్స్ నుండి అధికారిక ప్రకనట రావాల్సి ఉంది.
ఇక నాని సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన దర్శకుడు వివేక్ ఆత్రేయతో సరిపోదా శనివారం అనే సినిమా చేస్తున్నారు. డీవీవీ దానన్న నిర్మిస్తున్న ఈ సినిమాలో మలయాళ బ్యూటీ ప్రియాంక మోహనన్ నటిస్తున్నారు. జాక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న. ఈ మధ్య విడుదలైన ఈ సినిమా టీజర్ ప్రేక్షకుల్లో అంచనాలను పెంచేసింది. ఆగస్టు 29న విడుదల కానున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని సాధిస్తుంది అనేది చూడాలి.