మురుగు నీటి తో మునిగిన బాలాజీ నగర్ కాలనీ

V6 Velugu Posted on Oct 16, 2021

మధ్యాహ్నం కురిసిన భారీ వర్షానికి పలు కాలనీలు నీట మునిగాయి. దీనికి తోడు మురుగు నీరు తోడుకావడంతో ఇళ్లలోకి నీరు వచ్చి చేరుతోంది. ప్రధాన రహదారిపై వరదనీరు పోయేందుకు స్థలం లేకపోవడంతో నార్సింగి మున్సిపాలిటీలోని బాలాజీ నగర్ కాలనీ మురుగు నీటితో నిండిపోయింది. దీంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

మురుగు నీరు వచ్చి చేరడంతో.. కొంతమంది కాలనీ వాసులు సొంత ఇళ్లను కూడా వదిలేసి వేరో ప్రాంతానికి రెంట్ కు వెళ్లి పోతున్నారు. వర్షం వస్తే చాలు బాలాజీ నగర్ కాలనీ మొత్తం నీట మునుగుతుంది. అంతేకాదు డ్రైనేజ్ పొంగిపొర్లడంతో..మురుగు కాలనీలోకి వచ్చి చేరుతుంది. డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలని నార్సింగి మున్సిపాలిటీ అధికారులకు చాలా సార్లు ఫిర్యాదు చేశామని..అయినా పట్టించుకోలేదని స్థానికులు ఆవేద వ్యక్తం చేస్తున్నారు.

రోడ్లపైకి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడి..వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారన్నారు.

Tagged submerged, Balaji Nagar Colony, sewage water

Latest Videos

Subscribe Now

More News