బాలకృష్ణ 108 : షెడ్యూల్‌‌ పోస్ట్ పోన్

బాలకృష్ణ 108 : షెడ్యూల్‌‌ పోస్ట్ పోన్

అఖండ, వీరసింహారెడ్డి సినిమాలతో వరుస సూపర్ హిట్స్ అందుకున్న బాలకృష్ణ అదే జోష్‌‌లో 108వ చిత్రాన్ని పూర్తి చేయాలనుకున్నారు. అనిల్ రావిపూడి రూపొందిస్తున్న ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే కొంతభాగం జరిగింది. కొత్త షెడ్యూల్‌‌ను ఈ నెల 23 నుంచి స్టార్ట్ చేయాల్సి ఉంది. అయితే తారకరత్న మరణంతో ఈ షెడ్యూల్‌‌ను పోస్ట్ పోన్ చేస్తున్నట్టు ప్రకటించింది టీమ్. త్వరలోనే తిరిగి షూటింగ్ మొదలు పెట్టనున్నట్టు తెలియజేసింది.  షైన్ స్ర్కీన్స్ బ్యానర్‌‌‌‌పై హరీష్ పెద్ది, సాహు గారపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీలీల కీలక పాత్ర పోషిస్తోంది. తమన్ సంగీతం అందిస్తున్నాడు.  ఇదిలా ఉంటే.. ఈ సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన రూమర్స్ ప్రచారంలో ఉన్నాయి.  బాలకృష్ణ డ్యూయెల్ రోల్‌‌ చేస్తున్నారని, ఒక పాత్రకు జంటగా కాజల్ కనిపించనుందనే టాక్ వినిపిస్తోంది. అలాగే అంజలి నెగిటివ్ షేడ్‌‌ ఉన్న క్యారెక్టర్‌‌‌‌ చేస్తోందని ప్రచారమూ జరుగుతోంది.  మరి వీటిలో ఎంతవరకు నిజముందనేది తెలియాల్సి ఉంది.