NBK 111 చారిత్రక గర్జన షురూ.. యోధుడిగా బాలయ్య.. పవర్ ఫుల్ స్టోరీతో గోపీచంద్ మలినేని

NBK 111 చారిత్రక గర్జన షురూ.. యోధుడిగా బాలయ్య.. పవర్ ఫుల్ స్టోరీతో గోపీచంద్ మలినేని

సూపర్ హిట్ కాంబోలను రిపీట్ చేయడంలో నందమూరి బాలకృష్ణ ముందుంటారు. సక్సెస్ ఇచ్చిన దర్శకులు, ఆయనకు నచ్చిన దర్శకులతో  బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేయడానికి ఎంతో ఆసక్తి చూపిస్తారు. ఇప్పటికే బోయపాటి శ్రీనుతో మూడో చిత్రంగా ‘అఖండ2’లో నటిస్తున్నారు బాలకృష్ణ. ఈ క్రమంలోనే  ‘వీర సింహారెడ్డి’లాంటి హిట్ సినిమాను రూపొందించిన గోపీచంద్ మలినేనితో మరో మూవీ చేస్తున్నారు. NBK 111 వర్కింగ్ టైటిల్తో రానున్న ఈ చిత్రాన్ని 2025 జూన్ లోనే అనౌన్స్ చేశారు.

ఇవాళ బుధవారం (2025 నవంబర్ 26న) ఈ ప్రాజెక్ట్ పూజా కార్యక్రమాలతో అధికారింగా ప్రారంభమైంది. సుబ్రహ్మణ్య షష్ఠి పర్వదినం సందర్భంగా హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోస్‌లో NBK 111 పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఈ వేడుక‌కు బాల‌కృష్ణ‌తో పాటు డైరెక్టర్స్ బోయ‌పాటి శ్రీను, బుచ్చిబాబు, బాబి కొల్లి త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు. బాలయ్య ఇందులో మునుపెన్నడూ చూడని శక్తిమంతమైన, చారిత్రక పాత్రలో కనువిందు చేయనున్నారు.

'యోధుడిగా' నటిస్తుండటం బాలయ్య కెరీర్‌లోనే ఒక ప్రత్యేకమైన పాత్రగా నిలిచిపోయెలా క్యారెక్టర్ డిజైన్ చేశాడు డైరెక్టర్ గోపిచంద్ మలినేని. కేవలం యాక్షన్‌కే పరిమితం కాకుండా, చరిత్రలోని కొన్ని ముఖ్యమైన ఘట్టాలను జోడించి అద్భుతమైన కథను సిద్ధం చేశారని సినీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి, బాలయ్య తన తదుపరి చిత్రాలతో బాక్సాఫీస్‌ను షేక్ చేయడానికి పూర్తి స్థాయిలో సిద్ధమయ్యారు. 

ఈ హిస్టారికల్ మూవీలో బాలకృష్ణకి జోడీగా లేడీ సూపర్ స్టార్ నయనతార నటిస్తుంది. వీరి కాంబోలో సినిమా వస్తుందంటే అభిమానులకు పండగే. గతంలో వీరిద్దరు కలిసిన నటించిన 'సింహా', 'శ్రీ రామరాజ్యం', 'జై సింహా' చిత్రాలు ఘన విజయాలు సాధించాయి. ఇప్పుడు ఈ సూపర్ కాంబో నాలుగో సారి తెరపైకి వస్తుండటం విశేషం. ఈ భారీ ప్రాజెక్టును వృద్ధి సినిమాస్ బ్యానర్‌‌‌‌పై వెంకట సతీష్ కిలారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.