కొత్త సినిమాతో బిజీ అయిన బాలయ్య

కొత్త సినిమాతో బిజీ అయిన బాలయ్య

సంక్రాంతికి ‘వీరసింహారెడ్డి’గా వస్తున్న బాలకృష్ణ.. ఇది రిలీజ్ అయ్యేలోపు మరో మూవీతో  బిజీ అయ్యారు.  అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ ఈమధ్యనే ప్రారంభమైంది.  అయితే సూపర్ స్పీడ్‌‌‌‌తో మొదటి షెడ్యూల్‌‌‌‌ను పూర్తి చేసుకుందని శనివారం ప్రకటించారు మేకర్స్. ప్రొడక్షన్ డిజైనర్ రాజీవన్ హైదరాబాద్‌‌‌‌లో వేసిన జైలు సెట్‌‌‌‌లో మాసివ్ యాక్షన్ సీక్వెన్స్‌‌‌‌తో ఈ షెడ్యూల్‌ను పూర్తి చేశారు. ఈ యాక్షన్ సీన్స్‌‌‌‌కి వెంకట్‌‌‌‌ మాస్టర్ ఫైట్స్ కొరియోగ్రఫీ చేశారు.

బాలకృష్ణ, శరత్ కుమార్‌‌‌‌‌‌‌‌తో పాటు మరికొందరు ఆర్టిస్ట్‌‌‌‌లపై కీలక సన్నివేశాలని షూట్ చేశారు.  ఈ సెట్ లోనే కొత్త ఏడాదికి వెల్‌‌‌‌కమ్ చెబుతూ కేక్ కట్ చేశారు. ఇది బాలకృష్ణకి నూట ఎనిమిదవ సినిమా. శ్రీలీల ఇంపార్టెంట్ రోల్‌‌‌‌లో నటిస్తుంది.  షైన్ స్క్రీన్స్ బ్యానర్‌‌‌‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు.  ఇందులో బాలకృష్ణ  మాస్ అండ్ యాక్షన్‌‌‌‌తో పాటు అనిల్ రావిపూడి మార్క్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయంటున్నారు నిర్మాతలు.