
ఎన్టీఆర్ జీవితం ఆధారంగా క్రిష్ డైరెక్షన్ లో బాలయ్య హీరోగా నటించిన సినిమా ఎన్టీఆర్. ఈ మూవీ పార్ట్ -2 మహానాయకుడు ఇటీవల రిలీజ్ కాగా..సినిమాకి సంబంధించిన మేకింగ్ వీడియోను రిలీజ్ చేసింది యూనిట్. ఇందులో ఎన్టీఆర్ రాజకీయ జీవితానికి సంబంధించిన అంశాలు చూపించారు. రెండో భాగంలో ఆయనకు ఎదురైన కొన్ని పరాభవాల్ని చూపించాడు క్రిష్. ఎన్టీఆర్, బసవతారకం మధ్య ఉన్న అనుబంధం.. నాదెండ్ల భాస్కర్ రావుపై ఎన్టీఆర్ చేసిన పోరాటానికే పెద్దపీట వేస్తూ సినిమాను రూపొందించారు. నాదెండ్ల భాస్కర్ రావును విలన్ గా చూపించడానికే ఎక్కువగా ప్రాధాన్యతనిచ్చారు. ఎన్టీఆర్ జీవితంలో చివరి అంకాన్ని పూర్తిగా విస్మరించారు. మీరు ఈ మేకింగ్ వీడియోపై ఓ లుక్కేయండి.