ఇండస్ట్రీలోనే మొట్టమొదటిసారి.. ఏకంగా 108 హోర్డింగ్స్తో టైటిల్

ఇండస్ట్రీలోనే మొట్టమొదటిసారి.. ఏకంగా 108 హోర్డింగ్స్తో టైటిల్

నందమూరి ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. NBK108 మూవీ నుండి అప్డేట్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అభిమానులకు అదిరిపోయే ట్రీట్ ఇవ్వనున్నారు మేకర్స్. టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి(Anil Ravipudi)తో బాలకృష్ణ(Balakrishna) చేస్తున్న మూవీకి సంబంధించిన టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయనున్నారు. అది కూడా బాలకృష్ణ బర్త్ డే సందర్బంగా. జూన్ 10 ఆయన పుట్టినరోజు కాగా.. దానికి రెండు రోజుల ముందే ఈ అప్డేట్ రానుంది.

ఇందుకోసం మేకర్స్ భారీగానే ప్లాన్ చేశారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎవ్వరు చెయ్యని విదంగా..  రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి మొత్తం 108 ప్రాంతాల్లో 108 భారీ హోర్డింగ్స్ తో ఈ మాస్ టైటిల్ ను జూన్ 8న లాంచ్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. పక్క మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రానున్న ఈ సినిమా కోసం బాలయ్య ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. వీరసింహారెడ్డి(Veerasimha reddy) వంటి సూపర్ హిట్ తరువాత బాలయ్య నుండి వస్తున్న సినిమా కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇక ఈ సినిమాలో బాలకృష్ణ కు జోడీగా కాజల్(Kajal) నటిస్తుండగా.. యంగ్ బ్యూటీ సెన్సేషన్ శ్రీలీల(Sreeleela) కూతురి పాత్రలో కనిపించనుంది. థమన్(Thaman) సంగీతం అందిస్తున్న ఈ సినిమాను షైన్ స్క్రీన్ సినిమాస్(Shine Screen cinemas) నిర్మిస్తుండగా.. దసరా కనుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.