మిమ్మల్ని మార్చడానికి ప్రజలు, పంచభూతాలున్నాయి

 మిమ్మల్ని మార్చడానికి  ప్రజలు, పంచభూతాలున్నాయి

విజయవాడలోని  ఎన్టీఆర్  హెల్త్ యూనివర్సిటీ  పేరు మార్పుపై సినీ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే  నందమూరి బాలకృష్ణ రియాక్ట్  అయ్యారు. మార్చేయడానికి .. తీసేయడానికి.. ఎన్టీఆర్  అన్నది పేరు కాదని,  ఓ సంస్కృతి,  ఓ నాగరికత,  తెలుగుజాతి వెన్నెముక అన్నారు . తండ్రి  గద్దెనెక్కి  ఎయిర్ పోర్ట్  పేరు మార్చాడని,  కొడుకు గద్దెనెక్కి యూనివర్సిటీ పేరు మారుస్తున్నాడని  ఫైర్ అయ్యారు బాలకృష్ణ.  మిమ్మల్ని మార్చడానికి  ప్రజలు, పంచభూతాలు  ఉన్నాయి ...తస్మాత్ జాగ్రత్త  అంటూ ఫేస్ బుక్ వేదికగా  వార్నింగ్ ఇచ్చారు. విశ్వాసం  లేని వాళ్లను  చూసి  కుక్కలు వెక్కిరిస్తున్నాయని బాలయ్య కామెంట్ చేశారు.