వారసుడి ఎంట్రీకి రంగం సిద్ధం.. న్యూ లుక్ అదిరిపోయింది

వారసుడి ఎంట్రీకి రంగం సిద్ధం.. న్యూ లుక్ అదిరిపోయింది

నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) నట వారసుడు మోక్షజ్ఞ(Nandamuri Mokshagna) టాలీవుడ్ ఎంట్రీకి రంగం సిద్దమైందా? అంటే అవుననే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. రీసెంట్ గా మోక్షజ్ఞ లుక్ ఒకటి బాగా వైరల్ అయింది. అంతకుముందు కాస్త బొద్దుగా కనిపించిన మోక్షజ్ఞ.. రీసెంట్ లుక్ లో మాత్రం సన్నబడి చాల స్టైలీష్ గా కనిపించాడు.       

తాజాగా బాలకృష్ణ పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్న మోక్షజ్ఞ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాడు. ఆ వేడుకల్లో మోక్షజ్ఞ కనిపించిన లుక్ బాగా వైరల్ అయ్యింది. దీంతో నందమూరి ఫ్యాన్స్ వారసుడు ఎంట్రీకి రంగం సిద్ధం అయ్యింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక గత కొంతకాలంగా మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ గురించి వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపధ్యంలో తాజాగా లుక్ ఫుల్ వైరల్  కావడంతో ఆ వార్తలకు మరింత బలం చేకూరింది. ఈ కొత్త కచ్చితంగా ఎంట్రీ సినిమా కోసమే అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. 

ఇక బాలకృష్ణ డ్రీమ్ ప్రాజెక్టు ఆదిత్య 369(Adithya 369) సినిమాతోనే మోక్షజ్ఞ ఎంట్రీ ఇస్తున్నాడా? లేక కొత్త ప్రాజెక్ట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తాడా అనేది  దానిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.